రైతులను గాలికొదిలేసిన ప్రభుత్వం : వైసిపి

ప్రజాశక్తి-కడప కరువు వల్ల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి, రైతులను ప్రభుత్వం ఏమాత్రం ఆదుకోకుండా గాలికొదిలేసిందని వైసిపి జిల్లా అధ్య క్షులు పి.రవీంద్రనాథ్‌రెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం వైసిపి జిల్లా కార్యాల యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంలో రైతులకు మద్దతు ధర లేదన్నారు. విత్తనాల సరఫరా కూడా లేదన్నారు. బడ్జెట్‌లో రైతులకు కేటాయింపులే అరకొరేనని తెలిపారు. విజనరీ అని చెప్పుకోవడం తప్ప చంద్రబాబుకు విజన్‌ అంటూ లేదన్నారు. అన్నదాత సుఖీభవ అన్నాడు తప్ప ఏడాది గడిచినా రైతుకు రూ.20 వేలు ఇవ్వలేదన్నారు. పంట ఉత్పత్తులను కొనుగోలు చేయకుండా రైతులను ప్రభుత్వం పట్టించుకోలేదని పేర్కొన్నారు. అబద్దాలతో అధికారంలోకి వచ్చి మోసం చేసిన ప్రభుత్వం దేశంలో ఎక్కడ లేదన్నారు. శనగ పంట దిగుబడి సగమే వచ్చింది..దానికీ మద్దతు ధర లేదని తెలిపారు. గతంలో చంద్రబాబు పెట్టిన బీమా బకాయిలను జగన్‌ చెల్లించారని గుర్తుచేశారు. సమావేశంలో జడ్‌పి వైస్‌ చైర్మన్‌ బాలయ్య, వైసిపి నాయకులు పులి సునీల్‌కుమార్‌, నాగేంద్రారెడ్డి, సంబటూరు ప్రసాద్‌రెడ్డి, ఇలియాస్‌, నాగేంద్ర, మునిశేఖర్‌రెడ్డి, అశోక్‌రెడ్డి పాల్గొన్నారు.

➡️