ప్రజాశక్తి-రావులపాలెం (కోనసీమ) : ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. బుధవారం స్థానిక క్యాంపు కార్యాలయం వద్ద ఎమ్మెల్యే ఎమ్మెల్యే సత్యానందరావు ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా నియోజకవర్గంలోని పలు గ్రామాల నుండి ప్రజలు వినతులను ఎమ్మెల్యేకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వినతులపై స్పందించి మాట్లాడుతూ ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని నేటి ప్రజాదర్బార్ లో 292 వినతులు వచ్చాయని తెలిపారు.వాటి పరిష్కారం కోసం వినతులను ఆయా శాఖ అధికారులకు పంపుతామని తెలిపారు. గత ప్రభుత్వంలో జగన్ పేదలను మోసం చేసి ఇచ్చిన ఇళ్ల పట్టాలపై అధికంగా వినతులు,ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. త్వరలోనే ప్రజలు చేసుకున్న అర్జీలను పరిష్కరించి అర్హులకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకఅష్ణ, జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు చిలువూరి సతీష్ రాజు, గుత్తుల పట్టాభిరామారావు, జక్కంపూడి వెంకటస్వామి, కూటమి నాయకులు, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రజల సమస్యలు పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది : ఎమ్మెల్యే బండారు
