ప్రజాశక్తి-ఏలూరు స్పోర్ట్స్ : గుర్తు తెలియని వ్యక్తి వివేక్ ఎక్స్‌ప్రెస్ రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంగళవారం ఏలూరు రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేస్తుంది. పొట్టిపాడు రైల్వే గేట్ సమీపంలో 25 నుండి 30 సంవత్సరాలు వయసు కలిగిన ఉన్న వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారాన్ని రైల్వే పోలీసులు సమాచారం అందుకొని ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. అతని ఎత్తు 5 అడుగుల 5 అంగుళాలు, చామనఛాయ సిమెంట్ రంగు పొడుగు చేతుల చొక్కా నీలం రంగు షర్ట్ ధరించి ఉన్నాడని రైల్వే పోలీసులు తెలిపారు. ఇతడి వివరాలు తెలిసినవారు రైల్వే ఎస్సై సైమన్ కు సమాచారం ఇవ్వాలని సూచించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు సర్వే ఆస్పత్రికి తరలించారు. రైల్వే ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
