ప్రజాశక్తి-నార్పల (అనంతపురం) : మండల కేంద్రమైన నార్పల ఎంపీడీవో కార్యాలయానికి సోమవారం చేతిపంపు సామాగ్రి చేరింది. ఈ సందర్భంగా ఎంపీడీవో దివాకర్ ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ … మండల వ్యాప్తంగా నీటి ఎద్దడి ఉన్న గ్రామాల్లో చేతిపంపులు రిపేరు చేయడంతోపాటు నూతన బోర్లు వేసిన చోట చేతిపంపులు బిగించడం జరుగుతుందని మండలంలో తాగునీటి ఎద్దడి ఉన్న గ్రామాల్లో నీటి ఎద్దడి నివారించడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని తెలిపారు. పూర్తిగా నీరురాని గ్రామాలకు, కాలనీలకు నీటి ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నామని ఎక్కడైనా నీటి ఎద్దడి ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని అధికారులు తెలిపారు. అదేవిధంగా మండలంలో గ్రామాల వారీగా ఎన్ని చేతిపంపులు ఉన్నాయి ఎన్ని పనిచేస్తున్నాయి ఎన్ని పనిచేయడం లేదు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు సర్వే చేస్తున్నారని తెలిపారు. నార్పలకు వచ్చిన సామాగ్రిని ఈ ఓ ఆర్ డి శైలజా రాణి అడ్మినిస్ట్రేషన్ అధికారి ఉమాదేవి, మేజర్ పంచాయతీ కార్యదర్శి అస్వర్తనాయుడు పరిశీలించారు.
