సమస్యలు పరిష్కరించాలని వినతి

ప్రజాశక్తి – మార్టూరు రూరల్‌ : విశ్రాంత ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తహశీల్దారు ప్రశాంతికి వినతి పత్రం అందజేశారు. విశ్రాంత ఉద్యోగుల సంఘం మార్టూరు శాఖ అధ్యక్ష కార్యదర్శులు షేక్‌ కమాలుద్దీన్‌, ఎంఎస్‌.చిట్టిబాబు, కరణం లక్ష్మయ్య ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మార్టూరు యూనిట్‌ అధ్యక్షుడు షేక్‌ కమలుద్దీన్‌ మాట్లాడుతూ.. విశ్రాంత ఉద్యోగులకు 2023 జూలై నుంచి కొత్త పిఆర్‌సి కమిషన్‌ ఏర్పాటు చేయటానికి గత ప్రభుత్వ హయాంలోని ప్రజాప్రతినిధులు, అధికారులు చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వమైనా పిఆర్‌సి కమిషన్‌ ఏర్పాటు చేసి ఐఆర్‌ (ఇంటీరియం రిలీఫ్‌)ను ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. . ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు.అద్దంకి : విశ్రాంత ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తహశీల్దారుకు వినతి పత్రం అందజేశారు. విశ్రాంత ఉద్యోగుల సంఘం అద్దంకి యూనిట్‌ (బాపట్ల జిల్లాశాఖ-2) అధ్యక్షుడు షేక్‌ మస్తాన్‌, ప్రధాన కార్యదర్శి తేలప్రోలు కష్ణయ్య, కోశాధికారి మారం కోటేశ్వరరావు, సహాయ అధ్యక్షుడు పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్‌ నాయకులు పెన్షనర్ల సమస్యలు తక్షణమే పరిష్కరించాలన్నారు. . ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.ఇంకొల్లు : విశ్రాంత ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌ వెంకట మురళికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా విశ్రాంత ఉద్యోగుల సంఘం-2 జిల్లా అధ్యక్షుడు రావుల బాపయ్య, కార్యదర్శి కమలేశ్వరరావు మాట్లాడుతూ 12వ పిఆర్‌సిని వెంటనే అమలు చేయాలన్నారు. పెండింగ్‌ బకాయిలు విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగులు, యూనియన్‌ నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా విశ్రాంత ఉద్యోగుల సమస్యలు పరిష్కరిం చాలని కోరుతూ తహశీల్దారు రాధాకష్ణమూర్తికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు, కోశాధికారులు ఎర్రం కష్ణమూర్తి, తుమాటి ఆంజనేయులు, వై.గోపాల్‌ రావు, ఎలమంద, సుబ్బయ్య, శ్రీనివాసరావు పాల్గొన్నారు.బాపట్ల: విశ్రాంత ఉద్యోగులకు పెండింగ్‌ బకాయిలు చెల్లించాలని గ్రీవెన్స్‌లో తహశీల్దారుకు, జిల్లా కలెక్టరుకు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్‌ నాయకులు మాట్లాడుతూ పెండింగ్‌ డిఎ బకాయిలు చెల్లించాలని చెల్లించాలన్నారు. పిఆర్‌సి కమీషన్‌ వేయాలన్నారు. విశ్రాంత ఉద్యోగులకు అడిషనల్‌ క్వాంటమ్‌, 70 ఏళ్లు నిండిన వారికి 10 శాతం, 75 సంవత్సరాల వారికి 15 శాతం,80 సంవత్సరాల వారికి 20 శాతంగా నిర్ణయించాలన్నారు. ఎంప్లాయీస్‌ హెల్త్‌ కార్డులతో ఉచిత వైద్యం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ తాలూకా అధ్యక్ష, కార్య దర్శులు, కోశాధికారి వైవి.నరసింహారావు, పివి.ప్రసాద్‌, సుబ్బారావు, రామకష్ణ, విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కోడూరి ఏకాంబరీశ్వర బాబు, ప్రధాన కార్యదర్శి ఎన్‌. సిద్ధయ్య, కోశాధికారి ఎంవి. బ్రహ్మం, చీరాల ప్రాంత విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు.

➡️