శాంతించిన గోదావరి శబరి – వరదల్లో కూలిపోయిన బాధితుల ఇండ్లు

ప్రజాశక్తి-వి ఆర్‌ పురం (అల్లూరి) : శబరి గోదావరి శాంతించింది. ఆదివారం రోజున గంట గంటకు పెరిగిన వరద మంగళవారం ఉదయానికి స్వల్పంగా తగ్గటంతో వరద బాధితులు తమ గుడారాలు వదిలేసి ఇండ్లలో నీళ్లు ఉండగానే శుభ్రం చేసుకోవడానికి పడవలపై వెళుతున్నారు. అక్కడ తమ ఇండ్లలో కొన్ని పగుళ్లు వచ్చాయని కొన్ని ఒరిగిపోయాయని కొన్ని పూర్తిగా పడిపోయాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వరదలకు వడ్డుగూడెం కాలనీ నుండి వడ్డుగూడెం వరకు రహదారి పూర్తిగా కొట్టుకుపోయింది. ధర్మతాల గూడెం నుండి కూనవరం వెళ్లే ఆర్‌.ఎం.బి. రోడ్డు వరదకు కొట్టకుపోవడంతో వాహనాలుదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని ముంపుకు గురైన గ్రామాలు వరదల్లో పద మూడు రోజులుగా ఇండ్లు ఉండటంతో పాడైపోయే అవకాశం ఉంది. కన్నాయి గూడెం, నుండి రామవరం వరకు రోడ్డుపై మట్టి పేరక పోవడంతో వాహనదారులు జారి కింద పడుతున్నారని వెంటనే అధికారులు ఆ మట్టిని తొలగించాలని పాడైపోయిన రోడ్లను మరమ్మతులు చేయించాలని, పడిపోయిన ఇండ్లకు నష్టపరిహారం ఇవ్వాలని బాధితులు కోరుతున్నారు. గత ప్రభుత్వం సర్వేలు చేసిన గ్రామాలు ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ ఇచ్చి ఇక్కడ నుండి తరలించాలని, వరద సహాయ డబ్బులు 3 వేల రూపాయలు మండలంలోని ప్రతి ఒక్క కుటుంబానికి రేషన్‌ కార్డుతో సంబంధం లేకుండా కాలనీ అందరూ ముంపులో ఒక భాగమేనని ఈ వరదల వల్ల అందరూ నష్టపోయారని వీటికి అందరూ అర్హులే అని వరద బాధితులు వాపోయారు.

➡️