పాడేరు (అల్లూరి) : అల్లూరి జిల్లా పాడేరు మండలంలో గ్రామ సచివాలయ వలంటీర్లు చేపట్టిన నిరాహార దీక్ష శనివారంతో మూడో రోజుకు చేరింది. ఈరోజు గ్రామ వాలంటీర్లు అందరూ పాడేరు ఐటీడీఏ నుంచి పాత బస్టాండ్ మీదుగా పాడేరు ఎంపీడీవో ఆఫీస్ వద్ద ర్యాలీగా వెళ్లి పాడేరు మండల ఎంపీడీవో కి మెమొరాండం ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ఆదివాసి గిరిజన సంఘం మండల కార్యదర్శి సోమలిశెట్టి బాబు, వాలంటీర్ల జిల్లా అధ్యక్షులు మాదేల ప్రసాద్ రావు, మండల అధ్యక్షుడు వణుకు సుమేష్ కుమార్, మండల కార్యదర్శి మజ్జి సింహాచలం, సత్య రావు, దాసు కొండమ్మ, హేమలత, యమునా, నాయకులు పాల్గొన్నారు.
