నిరసన తెలుపుత్ను న్యాయవాదులు
నూతన క్రిమినల్ చట్టాల అమలును నిలిపివేయాలి
ప్రజాశక్తి-నెల్లూరు : జులై 1 నుంచి అమల్లోకి రానున్న మూడు కొత్త క్రిమినల్ చట్టాలను అమలు చేయాలన్న ఆలోచన విరమించుకోవాలంటూ ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలు) ఆధ్వర్యంలో న్యాయవాదులు నిరసన చేపట్టారు. గురువారం నగరంలోని జిల్లా కోర్టు సముదాయంలో ఈ నిరసన నిర్వహించారు. ఐలు సభ్యులు, సీనియర్ న్యాయవాదులు జక్కా శేషమ్మ, డి ఎస్ వి ప్రసాద్ మాట్లాడుతూ దేశంలోని చాలామంది మేధావులు ఈ చట్టాల అమలువల్ల తలెత్తే పరిస్థితులను గుర్తించి ఆందోళన వ్యక్తంచేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం న్యాయవాదుల ఆందోళనను ఏమాత్రం పట్టించుకోక పోవడం దారుణమన్నారు. 25 డిసెంబర్ 2023 భారత రాష్ట్రపతి ఈ చట్టాలకు ఆమోదముద్ర వేశారన్నారు. భారతీయ నాగరిక సురక్ష 2023, భారతీయ సురక్ష సంహిత 2023, భారతీయ సాక్ష్య అధినియం 2023, ఈ మూడు చట్టాలు అమలువల్ల పాత చట్టాలు క్రిమినల్‌బి ప్రొసీజర్‌బి కోడ్ 1973, భారతీయ శిక్షాస్మృతి 1860, భారతీయ సాక్ష్యాదారాల చట్టం 1872 రద్దు కాబడతాయన్నారు. జూన్ 30వ తేది 11.59 నిమిషాల వరకు నమోదైన కేసులకు వరిస్తాయని, ఆ కేసులు తుదిరూపు తీసుకునే వరకు ఈ చట్టాలు అమల్లో ఉంటాయన్నారు. పోలీసులు, న్యాయవాదులు, ప్రాసిక్యూటర్లు, న్యాయమూర్తులపై అధిక భారం పడు తుం దన్నారు. పార్లమెంటులో ఎలాంటి చర్చ జరగకుండా , ప్రతిపక్షాలను బయటకు పంపించి వేసి ఆమోదించడం దారుణమన్నారు. ఐలు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎస్. అంకయ్య, చుక్కా.రమేష్ మాట్లడుతూ పోలీసులకి విశేష అధికారాలను ఈ చట్టాలు ఇస్తున్నాయన్నాఉ. కొత్త చట్టాల వల్ల చాలా సమస్యలు వస్తాయన్నాఉ. న్యాయవాదులు రాఘవ, సుమంత్, అనిల్, ప్రసాద్,కిరణ్,సుధీర్, షాజీర్, శ్వేత,మల్లిక, లక్ష్మి దేవి పాల్గొన్నారు.
