సూపర్‌ సిక్స్‌ అమలు ఇంకెప్పుడో

ప్రజాశక్తి – పులివెందుల టౌన్‌ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ హామీల అమలు ఇంకెన్నాళ్లు అని ప్రజలు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు గడిచినా ఉచిత గ్యాస్‌ కనెక్షన్‌, పింఛను మినహా మిగిలిన వాటి అమలకు ఎలాంటి చర్యలు తీసుకో కపోవడంతో ప్రజల్లో ఆందోళన నెలకొన్నాయి. పథ కాలకు పేర్లు ప్రకటించడమే అప్ప అమలు చేయ డం ఆలస్యం అవుతోంది. కూటమి మేని ఫెస్టో హామీలపై ప్రజల్లో తీవ్ర చర్చ సాగుతోంది. గత ప్రభుత్వం పథకాల అమలు, ప్రస్తుత ప్రభుత్వం తీరుపై జనాల్లో చర్చ పెద్ద ఎత్తు న సాగుతోంది. హామీల అమలు కాక రైతులు, విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి జిల్లాల్లో దాదాపు 14 లక్షల వరకూ సాగుభూమి ఉంది. దాదాపు 5 లక్షల మంది రైతులు వ్యవసాయ సాగులో కీలక పాత్ర పోషిస్తున్నారు. వ్యవసాయం కష్టాల సాగుగా మారడంతో ప్రభుత్వ సాయం రైతులకు ముఖ్యంగా మారింది. తాము అధికారంలోకి వస్తే అన్నదాత సుఖీభవ కింద ఏడాదికి రూ.20 వేలు పెట్టుబడి సాయం ఇస్తామంటూ కూటమి నేతలు ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఏడు నెలలు గడిచి పోయింది ఖరీఫ్‌ పూర్తయ్యింది, రబీ ముమ్మరంగా సాగుతోంది. పెట్టుబడి సాయం మాత్రం అందలేదు. రైతులకు అత్యంత ముఖ్యమైన హామీని సైతం సకాలంలో అమలు చేయక పోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కౌలుచట్టంలో మార్పులు చేస్తామనే మాటను సైతం ప్రభుత్వం ఇప్పటికీ నెరవేర్చలేకపోయింది. ఒకటి నుంచి ఇంటర్‌ వరకూ గత ప్రభుత్వం అమ్మఒడి పేరుతో ఏడాదికి రూ. 15 వేలు జమ చేసింది. తాము అధికారంలోకి వస్తే కుటుంబంలో చదువుకుంటున్న ప్రతి పిల్లాడికి అమ్మకి వందనం కింద రూ. 15 వేలు చొప్పున ఇస్తామని కూటమి నేతలు చెప్పారు. ఇప్పటి వరకూ అమలు కాలేదు. జిల్లాలో ఒకటి నుంచి ఇంటర్‌ వరకూ చదువుతున్న విద్యార్థులు 4 లక్షలకు పైగా ఉన్నారు. విద్యా సంవత్సరం ముగింపు దశకు చేరుతోంది. ప్రయివేటు పాఠశాలలలో ముక్కు పిండి ఫీజు వసూలు చేస్తున్నారు. తల్లికి వందనం సొమ్ములేస్తే పిల్లల ఫీజులకు ఉపయో గపడతాయని తల్లిదండ్రులు ఎదురుచూస్తూనే ఉన్నారు. ఎప్పుడు వేస్తారో కనీసం ప్రకటించని పరిస్థితి నెలకొంది. 19 ఏళ్ళు నుంచి 50 ఏళ్ల మధ్య మహిళలకు నెలకు రూ.1500 జమ చేస్తామని చెప్పారు. అది ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉంది. ఉద్యోగాలు వచ్చే వరకూ యువ తకు నిరుద్యోగ భతి కింద నెలకు రూ.3 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. అసలు అమలు చేస్తారా అనే అనుమానాలు నెలకొన్నాయి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై మాటలు తప్ప ఆచరణ లేకుండా పోయింది. సూపర్‌ సిక్స్‌ పేరుతో ప్రభు త్వం చెప్పిన కీలక హామీల్లో ఉచిత గ్యాస్‌ పథకం ఒక్కటే ఇప్పటి వరకూ అమలు చేసిన పరిస్థితి నెలకొంది. ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి ఆస్పత్రు లకు బకాయలు చెల్లించకపోవడంతో వారు కూడా వైద్యం అందించడం లేదు దీంతో ఇది కూడా అటకె క్కినట్లే అన్న ఆరోపణ లున్నాయి.చంద్రన్న బీమాపైన నిర్లక్ష్యం ఇంట్లో కుటుంబ యజమాని మతి చెందితే ఇచ్చే చంద్రన్న బీమా సైతం ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. సహజ మరణానికి రూ. 5 లక్షలు, ప్రమాద మరణానికి రూ.10 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారు. బీమా అంటే కష్టకాలంలో ఉపయోగపడేదని అందరికీ తెలిసి ందే. కుటుంబ యజమానిని కోల్పోయి ఎన్నో కుటుంబాలు దుర్భర పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ ఏడు నెలల కాలంలో వందల కుటుంబాలు కుటుంబ పెద్దను కోల్పోయి కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. వారి పిల్లల చదువులకు, బతుకు సవ్యంగా సాగాలనే బీమా సొమ్ములు ఆధారంగా ఉంటాయి. పథకానికి పేరు ప్రకటించినా అమలు కాని పరిస్థితి నెలకొంది.సంక్రాంతి కానుకకు మంగళం 2014-19 మధ్యలో టిడిపి ప్రభు త్వం సంక్రాంతి కానుక కింద నిత్యావసర సరుకులకు అందించింది. గత వైసిపి ప్రభుత్వం దీన్ని నిలిపివేసింది. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సంక్రాంతి కానుక ఇస్తామని అప్పట్లో ప్రకటించారు. మరో నాలుగు రోజులు సంక్రాంతి పండుగ రానుంది. సంక్రాంతి కానుక ఊసే లేకుండా పోయింది. ముఖ్యమైన పథకాల అమలులోనూ ప్రభుత్వం తాత్సారం వహిస్తుందనే విమర్శలు విన్పిస్తున్నాయి.ప్రభుత్వం ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ పథకాలివే..ష యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నెలకు రూ మూడు వేల నిరుద్యోగ భతిష స్కూల్‌కు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15 వేలు 3. ప్రతి రైతుకూ ఏటా రూ.20 వేలు ఆర్థిక సాయం ష ప్రతి మహిళకూ నెలకు రూ.1500 (19 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వరకూ)ష ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్‌ సిలిండర్లుష మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం (వీటీలో ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పధకం ఒక్కటే అమల్లోకి వచ్చింది)పిల్లల చదువు భారం అవుతుంది తల్లికి వందనం కింద ప్రతి విద్యార్థికి రూ. 15వేలు ఇస్తామని చెప్పి ఆలస్యం చేస్తు న్నారు. స్కూల్లో మాత్రం ఫీజులు కట్టకపోతే పిల్లలను బయటకు పంపిస్తున్న పరిస్థితి. దీంతో అప్పులు చేసి ఫీజులు కట్టాల్సి వచ్చింది.- వెంకట లక్ష్మమ్మ, వ్యవసాయ కూలీ, పులివెందులనిరుద్యోగ భతి లేక యువతకు కష్టాలు నిరుద్యోగ భతి ఇస్తే చదువుకున్న యువత పుస్తకాలు తెచ్చుకొని చదువుకోడానికి వీలుంటుంది. కానీ ఈ పథకం ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్ల ఎంతోమంది పేద విద్యార్థులు చాలా కష్టాలు పడుతున్నారు.- సాయి, నిరుద్యోగి ,పులివెందుల పెట్టుబడి కష్టమవుతుంది పంట సాగు చేయాలంటే పెట్టుబడి కష్టమవుతుందని రైతుకు ప్రతి సంవత్సరం ఆర్థిక సహాయం చేస్తామని నిర్లక్ష్యం చేయడం వల్ల పెరిగిన ధరల దృష్ట్యా రైౖతుకు సాగు భారంగా మారుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం సత్వరమే ఆర్థిక సహాయాన్ని అందించాలి. – రాజ కుళ్ళాయి రెడ్డి, రైతు లింగాల మండలం మహిళలకు భరోసా ఎక్కడ ప్రతి మహిళకు భరోసా కల్పించాలన్న ఉద్దేశంతో 19 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు లోపు ఉన్న మహిళలకు ప్రతినెల రూ.1500 ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చి మహిళలకు అండగా ఉండాలి.- సుజాత, గహిణి పులివెందుల

➡️