”ఫిష్‌ ఆంద్రా ” కేంద్రాలను ఎత్తివేసిన వారిపై చర్యలు తీసుకోవాలి : భారత విప్లవ కమ్యూనిస్ట్‌ పార్టీ, రాహుల్‌ ఎడ్యూ కేషనల్‌ రూలర్‌ డెవలప్మెంట్‌ సొసైటీ

నంద్యాల అర్బన్‌ : నంద్యాల పట్టణంలోని గత ప్రభుత్వ హయాంలో ”ఫిష్‌ ఆంధ్ర” పధకాన్ని పేదల కోసం తీసుకొచ్చారని కాకపొతే కొందరు ఆ నిధులు తీసుకొని రావాల్సిన రాయితీలను అప్పనంగా తీసుకొని మూడునాళ్ళ ముచ్చటగా ముసివేశారని అలాంటి వారిపై జిల్లా కలెక్టర్‌, మత్య్య శాఖ అధికారులు చర్యలు తీసుకొని వాటిని మళ్ళీ పునరుద్దరణ చెయ్యాలని భారత విప్లవ కమ్యూనిస్ట్‌ పార్టీ జిల్లా కార్యదర్శి గాలి రవిరాజ్‌ రాహూల్‌ ఎడ్యూ కేశనల్‌ రూలర్‌ డెవలప్మెంట్‌ సోసైటీ రాష్ట్ర కార్యదర్శి షేక్‌ ఎజాస్‌ లు డిమాండ్‌ చేశారు అనంతరం పై నాయకులు మాట్లాడుతూ గతంలో ఉమ్మడి జిల్లాలో ”ఫిష్‌ ఆంధ్ర”పధకం కింద చిన్న పెద్ద మధ్య రకం చేపల విక్రయశాలలు అట్టహాసంగా ఏర్పాటు చేశారు కేంద్రం నుండి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద యస్సి, యస్టీ, లబ్దిదారులకు 60% ఇతరులకు 40%రాయితీలు ఇచ్చారు కానీ అర్హులైన వారికి కాకుండా అయినా వారికి ఆకులో కానివారికి కంచ్చాలో మాదిరిగా ఇష్టం వచ్చినట్లు నిధులను దూర్వినియోగ పరిచారు అవికూడా సక్రమంగా అమలు అవుతున్నాయా అంటే మూడునాళ్ళ ముచ్చట మాదిరిగా వాటి ఆనవాళ్లు కూడా లేవని నిధులను అప్పనంగా దొచేసినారాని వారు ఆరోపించారు ఇకానైనా అధికారులు ఎవరికి ఎక్కడ రుణాలు ఇచ్చారో వారినుండి రిఖవరి అయినా చెయ్యాలి లేదా వాటిని సక్రమంగా నైనా యదవిధిగా దుకాణాలు తెరిపించాలని వారు డిమాండ్‌ చేశారు

➡️