కొనసాగుతున్న పోలీస్‌ పికెట్‌ – దర్యాప్తు ముమ్మరం

ప్రజాశక్తి-రామచంద్రపురం (కోనసీమ) : కే.గంగవరం మండలంలోని ఎర్రపోతవరం లాకులు వద్ద అంబేద్కర్‌ విగ్రహానికి అవమానం జరిగిన సంఘటనపై పోలీస్‌ పికేట్‌ కొనసాగుతుంది. సంఘటన జరిగిన రోజు నుండి మంగళవారం వరకు పికేట్‌ కొనసాగుతుంది. రామచంద్రపురం సిఐ దొర రాజు, ఎస్సై జానీ భాష లు ఆధ్వర్యంలో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుంది. ఈ కేసు ఛేదించేందుకు పోలీసులు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. టెక్నికల్‌ గా దీనిపై మరింత లోతుగా విచారణ జరిపి త్వరలోనే నిందితులను అరెస్టు చేస్తామని ఈ సందర్భముగా ఎస్సై జానీ భాష తెలిపారు. మూడు రోజులైనా నిందితుల జాడ దొరకకపోవడంతో పరిసర ప్రాంతాల్లో దళితులు ఈ విషయమై చర్చించుకుంటున్నారు.

➡️