కడియం లో ఘనంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం

ప్రజాశక్తి-కడియం (తూర్పు గోదావరి) : మండల కేంద్రమైన కడియం బబ్బిలి బ్రిడ్జి సెంటర్‌ నందు జనసేన పార్టీ 14 వ ఆవిర్భావ దినోత్సవం పార్టీ శ్రేణులు ఆధ్యర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సెంటర్‌ లో గల స్తూపంవద్ద జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో ముద్రగడ జెమ్మి, చిలుకూరి నాగేశ్వరరావు, నాగిరెడ్డి రామకృష్ణ, గొల్ల పల్లి శ్రీను, తోరాటి శ్రీను, గ్రీన్‌ ల్యాండ్‌ బాబీ తదితరులు పాల్గొన్నారు.

”జేగురుపాడు నుండి భారీ ర్యాలీ”
మండలం లోని జేగురుపాడు గ్రామం నుండి శుక్రవారం పిఠాపురం లో జరుగు జనసేన ఆవిర్భావ సభకు అధికసంఖ్యలో పార్టీ శ్రేణులు తరలివెళ్లారు. కార్లు, మోటార్‌ సైకిళ్లు తదితర వాహనాల్లో వందలాది మంది కార్యకర్తలు, నాయకులు బయలు దేరి వెళ్లారు. ఈ ర్యాలీ లో గ్రామ ఎంపిటిసి నాగిరెడ్డి రామకృష్ణ, జెనసేన నాయకులు కర్రి చిన్న బాబు, ఆకుల మూలరాజు, దుడే శివ, నాగిరెడ్డి భాస్కర్‌, నాగిరెడ్డి కాశీ, రంకిరెడ్డి చిట్టి బాబు, గంగరాజు రమణ, చింతలపూడి సత్తి బాబు, హనుమంతు శ్రీను, చిక్కాల వంశీ, అన్నందేవుల యాదగిరి, పల్ల డాన్‌, మద్దినాల సాయి, జిగదాపు విజయ్, వనమాలీ శ్రీను తదితరులు ఉన్నారు.

➡️