ప్రజాశక్తి, మండపేట (కోనసీమ) : ఆంధ్రా శబరిమలగా ప్రసిద్ధిగాంచిన ద్వారపూడి అయ్యప్ప స్వామి ఆలయం వద్ద ఆంద్రా,తెలంగాణ రాష్ట్రాల్లోనే అతిపెద్ద ఆదియోగి విగ్రహాన్ని నిర్మించారు. 60 అడుగుల ఎత్తు 100 అడుగుల వెడల్పుతో ఈ విగ్రహాన్ని అద్భుతంగా తీర్చి దిద్దుతారు. మహాశివరాత్రి రోజున (ఈనెల 26) విగ్రహాన్ని ప్రారంభించనున్నారు. తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరు ఈసా యోగా కేంద్రంలో 112 అడుగుల ఎత్తు 82 అడుగుల వెడల్పుతో నిర్మించిన విగ్రహం భక్తుల ఆదరణ విశేషంగా పొందుతుంది.ఆ విగ్రహం రూపంలోనే కోనసీమ జిల్లా, మండపేట మండలం లోని ద్వారపూడిలో బిక్కవోలు మండలం కొమరిపాలెం కు చెందిన శిల్పి పెద్ద రాఘవ బఅందం పదినెలలు పాటు శ్రమించి విగ్రహాన్ని రూపొందించారు. పూర్తిగా సిమెంట్ తో సుమారు రూ.20 లక్షల వ్యయంతో ఈ విగ్రహాన్ని నిర్మించినట్లు ఆలయ గురుస్వామి ఎస్.ఎల్. కనకరాజు తెలిపారు.
