మెటీరియల్‌కు కరెంటు వైర్లు తగిలి వాహనం దగ్ధం

ప్రజాశక్తి-మండపేట (కోనసీమ) : వాహనంలోని మెటీరియల్‌కు కరెంటు వైర్లు తగిలి నడిరోడ్డుపై వ్యాన్‌ దగ్ధమైన ఘటన సోమవారం జరిగింది. స్థానికులు, అగ్నిమాపక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం …. ద్వారపూడి నుండి ఇప్పనపాడు గ్రామంలో ఉన్న ఏరోప్లేక్స్‌ పరుపుల గోడౌన్‌ వద్దకు వ్యాన్‌ పై రీబాండెడ్‌ పరుపుల మెటీరియల్స్‌ను తీసుకుని వస్తుండగా, గోడౌన్‌ సమీపంలో రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్‌ వైర్లు తగలడంతో నిప్పు అంటుకుంది. దీనిని గమనించిన అక్కడ కార్మికులు వ్యాన్‌ డ్రైవర్‌ కి చెప్పడంతో హుటాహుటిన పక్కనే ఉన్న ఖాళీ స్థలంలోకి వాహనాన్ని తీసుకు వెళ్లే ప్రయత్నం చేశాడు. అప్పటికే మంటలు వేగంగా చెలరేగడంతో రోడ్డుపైనే వ్యాన్‌ నిలిశారు. సంఘటన స్థలానికి మండపేట, అనపర్తి అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ అగ్నిప్రమాదంలో జరిగిన ఆస్తి నష్టం సుమారు 10 లక్షల రూపాయలు వరకు ఉంటుందని తెలియజేశారు. ఈ అగ్ని ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రమాదం, ప్రాణ నష్టం జరగలేదు. రోడ్డుపై వాహనాలు నిలిచిపోవడంతో కొంత సమయం ట్రాఫిక్‌ కి అంతరాయం కలిగింది.

➡️