ఏసీబీకి చిక్కిన ఎంఇఒ

Feb 11,2025 00:31

ప్రజాశక్తి-చిలకలూరిపేట : ఉద్యోగ విరమణ చేసిన ఉపాధ్యాయుని పిఎఫ్‌ ఫైల్‌ క్లియర్‌ చేయడానికి లంచం తీసుకుంటూ చిలకలూరిపేట ఎంఇఒ ఎం.లక్ష్మిభారు సోమవారం ఏసీబీకి పట్టుబడ్డారు. బాధిత ఉపాధ్యాయుని కథనం ప్రకారం.. చల్లా వెంకట శ్రీనివాసరావు అనే వ్యక్తి ఉపాధ్యాయునిగా రిటైర్‌ అయ్యారు. అతనికి సంబంధించిన పిఎఫ్‌ ఫైల్‌ను ట్రెజరీకి పంపకుండా పదేపదే కార్యాలయం చుట్టూ తిప్పించుకుని రూ.30 వేలు డిమాండ్‌ చేశార. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు. మధ్యవర్తి ద్వారా డబ్బును తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకు న్నారు. ఇదిలా ఉండగా ఉపాధ్యాయులకు సెలువులు, మెటర్నిటీ లీవులు తదితరాలకు ఒక్కో ఉపాధ్యాయుని వద్ద రూ.300 చొప్పున వసూలు చేస్తున్నారని, ఆడిటింగ్‌ అంటూ రూ.100 తీసుకుంటాన్నారని ఎంఇఓపై ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు.

➡️