ప్రజాశక్తి-రాచర్ల: ప్రభుత్వం పాడి రైతుల సంక్షేమం కోసం విశేష కృషి చేస్తోందని గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి అన్నారు. రాచర్ల మండలం, గౌతవరం గ్రామంలో నూతనంగా నిర్మించిన మినీ గోకులాలను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భగా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనివిధంగా పాడి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అధిక నిధులు ఖర్చు చేసి వారి సంక్షేమానికి కృషి చేస్తున్నదని అన్నారు. అందులో భాగంగా గిద్దలూరు నియోజకవర్గంలో పాడి రైతులకు ప్రోత్సాహకంగా మినీ గోకులాలు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాచర్ల మండల ఎంపీపీ షేక్ ఖాసీంబీ, సర్పంచ్ లక్ష్మిదేవి, ఎంపీటీసీ యెలం రాజేశ్వరి, మండల పార్టీ అధ్యక్షులు కటికే యోగానంద్, పార్లమెంట్ నాయకులు గోపిరెడ్డి జీవన్‌రెడ్డి, ఎంపీడీఓ సూరే వెంకటరామిరెడ్డి, వ్యవసాయ శాఖ ఎడిఎ బాలాజీ నాయక్, ఉపాధి పథకం ఏపిఓ మోషే, వివిధ శాఖల అధికారులు, మండల టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. యర్రగొండపాలెం: పాడి రైతులకు చేయూత అందించేందుకు, పాడి పరిశ్రమను ప్రోత్సహించేందుకు కూటమి ప్రభుత్వం మినీ గోకులాలను ప్రారంభించిందని టీడీపీ యర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్‌ఛార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. మండలంలోని మొగుళ్లపల్లి గ్రామంలో రూ.6.30 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన 3 మినీ గోకులం షెడ్లను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎరిక్షన్‌బాబు మాట్లా డుతూ గత వైసీపీ సర్కార్ వీటిని విస్మరించిందన్నారు. లబ్ధిదారులకు బిల్లులు చెల్లించకుండా ఇబ్బంది పెట్టిందని, అందుకే కూటమి ప్రభుత్వం పాడి పరిశ్రమపై ప్రత్యేక దృష్టిపెట్టి మినీ గోకులాల నిర్మాణాలకు పచ్చజెండా ఊపిందన్నారు. పశుపోషకులకు 90 శాతం, జీవాలు, కోళ్ల పెంపకందారులకు 70 శాతం రాయితీ ఇచ్చి నిర్మిస్తున్నద న్నారు. దీంతో పాడిపరిశ్రమకు పూర్వవైభవం వచ్చింద న్నారు. పాడి రైతుల కళ్లలో ఆనందం కనపడుతోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బి శ్రీనివాసులు, ఏపీవోలు శైలజ, నాగేశ్వరరావు, ఎంపీటీసీ యల్లయ్య, టీడీపీ నాయకులు చేకూరి సుబ్బారావు, వేగినాటి శ్రీను, మంత్రు నాయక్, చిట్యాల వెంగల రెడ్డి, కంచర్ల సత్యనారాయణ గౌడ్, ఎస్టీ కార్పొరేషన్ డైరెక్టర్ చెవుల అంజయ్య, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. పెద్దారవీడు: మండలంలోని తోకపల్లి గ్రామంలో మినీ గోకులాన్ని యర్రగొండపాలెం నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు శనివారం ప్రారంభిం చారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్ మెట్టు శ్రీనివాసరెడ్డి, మండల నాయకులు గొట్టం శ్రీనివాసరెడ్డి, మాజీ సర్పంచి నరాల శ్రీనివాసులు, దుగ్గెంపూడి కొండారెడ్డి, చంద్రగుంట్ల నాగేశ్వరరావు, తిరుమలరెడ్డి వెంకటరెడ్డి, టిడిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పెద్దదోర్నాల: పెద్దదోర్నాల మండలంలోని రామచంద్రకోట, బొమ్మలాపురం, గంటవానిపల్లి గ్రామాలలో ప్రభుత్వ సబ్సిడీతో నిర్మించిన గోకులను శనివారం ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం పశుపోషకులకు పెద్ద పీట వేస్తుందని తెలిపారు. గోకులాలు పశుపోషకులకు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ మల్లికార్జునరెడ్డి, నాయకులు సుధాకర్ రెడ్డి, శేషాద్రి, చంటి, రామిరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, శ్రీనివాస్ యాదవ్, శివారెడ్డి, ఈసి చాణిక్య తదితరులు పాల్గొన్నారు.