పాలేరుపై చప్టా నిర్మించాలని మంత్రికి వినతి

ప్రజాశక్తి-టంగుటూరు : జరుగుమల్లి మండలంలోని చింతలపాలెం, రామనాధపురం గ్రామాల మధ్య ఉన్న పాలేరు నదిపై చప్టా లేనందున ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సిపిఎం జరుగుమల్లి మండల కన్వీనర్‌ వి మోజెస్‌ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామికి వివరించారు. తూర్పునాయుడు పాలెంలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి స్వామికి ఆయన సిపిఎం నాయకులతో కలిసి అర్జీ ఇచ్చారు. మంత్రి స్పందిస్తూ ఈ సమస్య తన దృష్టిలో వున్నదని, పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. అలాగే రామనాథపురం గ్రామంలో రోడ్డుకు ఒక వైపు నందనవనం పంచాయతీలో రెండో వైపు పలుకూరు పంచాయతీలో ఉండటం వల్ల తమకు చాలా ఇబ్బందికరంగా ఉందని గ్రామ ప్రజలు మంత్రి దృష్టికి తీసుకొనివచ్చారు. దీని మీద మంత్రి స్పందిస్తూ అర్జీ పెట్టండి పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తానని రామనాథపురం గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు జీ శ్రీనివాస్‌, తానికొండ నారాయణరావు, తన్నీరు సుబ్బారావు, కూనంనేని శేషయ్య, సిహెచ్‌ తిరుమలరావు, ప్రజలు పాల్గొన్నారు.

➡️