కిమ్స్‌ హాస్పటల్స్‌, ఒంగోలు వద్ద అత్యంత క్లిష్టతరమైన బెంటాల్స్‌ సర్జరీ విజయవంతం

ప్రకాశం : ప్రకాశం జిల్లాలో తొలిసారి గా కిమ్స్‌ హాస్పిటల్స్‌, ఒంగోలు వద్ద బెంటాల్స్‌ ఆపరేషన్‌ విజయవంతం అయినట్లు హాస్పిటల్‌ బృందం తెలిపింది. 55 సంవత్సరాల వయసు గల వ్యక్తి ఆయాసం, గుండెదడ తో బాధపడుతూ కిమ్స్‌ హాస్పిటల్‌, ఒంగోలు వద్ద డాక్టర్‌.లక్ష్మణ్‌ రెడ్డిని సంప్రదించడం జరిగింది. అతనికి ఈసిహెచ్‌ఒ, సిటి ఎఒఆర్‌టిఒజిఆర్‌ఎఎం Caronary Angiogram పరీక్షలు చేసి అతనికి అయోర్టిక్‌ రీ గర్జిడేషన్‌, బైకస్‌ పిడ్‌ అయోర్టిక్‌ వాల్వ్‌ తో పాటుగా అసెండింగ్‌ అయోర్థి అన్యూర్థిజం అనే వ్యాధి తో బాధపడుతున్నట్లు నిర్దారించడం జరిగింది. ఇలాంటి వ్యాధి 1000 మంది ల 1 లేదా 2 కి వచ్ఛే అవకాశం ఉంది. ఈ వ్యాది సిస్టమిక్‌ కనెక్టివ్‌ టిషఉ్య డిసార్డర్‌హొ వల్ల వస్తుంది.ఈ వ్యాధి చికిత్స సమయంలో ప్రాణాపాయ పరిస్థితులు ఎక్కువ. డాక్టర్‌ లక్ష్మణ్‌ రెడ్డీ ప్రత్యేక శ్రద్దతో ఈ పేషెంట్‌ కు అయోర్టిక్‌ కవాటం, అయోర్థిక్‌ రూట్‌, గుండె కి రక్తం సరఫరా చేసే రక్త నాళం గుండె నుండి బయటికి వచ్ఛే ప్రధాన రక్త నాళం అన్నిటిని శస్త్ర చికిత్స ద్వారా కృత్రిమ కవాటం కృత్రిమ అయోర్థిక్‌ రూట్‌ ను విజయవంతంగా మార్చడం జరిగింది. పేషెంట్‌ త్వరగా కోలుకోవడం తో 5 వ రోజునే డిశ్చార్జ్‌ చేయడం జరిగింది. ఈ శస్త్ర చికిత్స ను విజయవంతం చేసిన డా.లక్ష్మణ్‌ రెడ్డీ, , డా.రామకృష్ణ ఆపరేషన్‌ బృందం ను కిమ్స్‌ హాస్పిటల్‌ మెడికల్‌ సూపరెండెండెంట్‌ డాక్టర్‌ హరి రెడ్డీ అభినందించారు. అన్ని రకాలైన అత్యాధునిక పరికరాలు, మెరుగైన సేవలు అందించటం లో కిమ్స్‌ హాస్పిటల్‌ ముందు ఉంటుందని ఈ డి. టి.గిరినాయుడు తెలుపుతూ వైద్య బృందాన్ని అభినందించారు.

➡️