ప్రజాశక్తి- సిఎస్ పురం: రూరల్‌ప్రమాదవశాత్తు మోటార్ బైక్ బోల్తా పడి ఒకరు గాయపడిన సంఘటన మండలంలోని శీలంవారిపల్లి సమీపంలో గురువారం జరిగింది. నల్లమడుగుల గ్రామానికి చెందిన షేక్ మౌళి సిఎఎస్ పురం నుంచి నల్లమడుగులకు వెళుతుండగా శీలంవారిపల్లి గ్రామం దాటిన తర్వాత చప్టా దగ్గర మోటార్ బైక్ అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో మౌళికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రుడు సిఎస్ పురం ఆర్‌ఎంపి వైద్యుల వద్ద చికిత్స పొందారు. రోడ్డుకు ఇరువైపులా చిల్లచెట్లు ఏపుగా పెరిగిన కారణంగా ఈ ప్రాంతంలో ప్రమాదాలు జరుగుతున్నట్లు పరిసర ప్రాంత ప్రజలు తెలియజేస్తున్నారు.