జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమం విజయవంతం చేయాలి

ప్రజాశక్తి-కడియం (తూర్పు గోదావరి) : ఈ నెల 10వ తేదీ సోమవారం జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమం చేపట్టనున్నట్లు కడియం పిహెచ్‌ సి వైద్యాధికారిణి డాక్టర్‌ మణిజ్యోత్స్నా తెలిపారు. మండలంలో ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలలు మరియు అంగన్వాడీ కేంద్రాల యందు 1-19సంవత్సరాల వయస్సు పిల్లలందరికీ ఆల్బెండజోల్‌ మాత్రలను మింగించడం జరుగుతుందని ఆమె తెలిపారు. వైద్య,ఆరోగ్య శాఖ,విద్యా శాఖ, మరియు స్త్రీ శిశుసంక్షేమ శాఖలు సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. కడియం మండల పరిషత్‌ కార్యాలయంలోముందస్తు సన్నాహక సమావేశం శుక్రవారం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎంఈఓ వై.నాగేశ్వరరావు, ఎసిడిపిఓ కనకవల్లి, ఆరోగ్య విస్తరణాధికారి ఎం. రామకఅష్ణ,ఎఎన్‌ఎం లు అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️