ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్ అటవీ ప్రాంతంలో వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకున్న చిరుత పులిని రక్షించే క్రమంలో ఫారెస్ట్ అధికారులు పూర్తి వైఫల్యం చెందారు. వారి నిర్లక్ష్యం కారణంగా రెండేళ్ల వయసున్న ఆడ చిరుత బలైపోయింది. అధికారులు చిరుతను రక్షించేందుకు వేగంగా నిర్ణయాలు తీసుకోలేదు. సంఘటనా స్థలానికి వచ్చిన తర్వాత ఎక్కడో 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుపతి జూ అధికారులను ఫోన్ల ద్వారా సంప్రదింపులు జరిపి సలహాలు, సూచనల కోసం ప్రయత్నం చేశారు తప్ప, అప్పటికే గంటల తరబడి ఉచ్చుకు తగులుకుని గిలగిలా కొట్టుకుం టున్న చిరుతకు కనీసం నీటిని అందించే ఏర్పాటు కూడా చేయలేక పోయారు. అధికారుల తీరుపై గ్రామస్తులు ఆగ్రహించారు. కేవలం అధికారుల నిర్లక్ష్యం వల్లే చిరుత చనిపోయిందని విమర్శలు గుప్పించారు. మదనపల్లె మండలం పొన్నేటిపాలెం సమీపంలోని అడవిలో బుధవారం తెల్లవారుజామున నీటి కోసం పొలాల వైపు వచ్చిన సుమారు రెండేళ్ల వయసున్న ఆడ చిరుతపులి వన్యప్రాణుల కోసం వేటగాళ్లు వేసిన ఉరిలో చిక్కుకుంది. ఉదయం 5 గంటల నుంచి చిరుత అరుపులు విన్న గ్రామస్తులు పొలాల దగ్గరకి వెళ్లి ఉచ్చుకు చిక్కుకున్న చిరుత గమనించి ఫారెస్ట్ అధికారులకు సమాచారాన్ని చేరవేశారు. ఉదయం ఎనిమిది గంటలకే సమాచారం అందుకున్న ఫారెస్ట్ సిబ్బంది బీట్ ఆఫీసర్లు సుమిత, జయరాం, ఉమాదేవి సంఘటనా స్థలానికి చేరుకొని విషయాన్ని ఎఫ్‌ఆర్‌ఓ జయ ప్రసాద్ రావు, సబ్ డిఎఫ్‌ఒ శ్రీనివాసులకు చేర వేశారు. అధికారులు చిరుతను వీలైనంత త్వరగా రక్షించేందుకు తీసుకోవలసిన ప్రణాళికలతో సంఘటనా స్థలా నికి చేరుకోలేదు. అక్కడికి వచ్చిన తర్వాత బోను కావాలని, డాటెడ్ గన్ కావాలని, శిక్షణాత్మలైన డాక్టర్లు కావాలని చర్చించు కుంటూ తిరుపతిలో ఉన్న జూ అధికా రులను ఫోన్‌లో సంప్రదించారు. ఉచ్చుకు బిగిసుకున్న చిరుత విడిపించుకోవడా నికి గంటల తరబడి నరకయాతన అనుభ వించింది. ఈ విషయం సమీప ప్రాంతాల్లో దావణంలా వ్యాపించడంతో చిరు తను చూసేందుకు జనం ఎగబడ్డారు. ఈ దశలో గ్రామస్తులు ధైర్యం చేసి సార్ పాపం.. చిరుత చనిపో తుంది సార్.. నీళ్లైనా పెట్టించే ఏర్పాటు చేయించండి. లేదా మమ్మల్ని అయినా పంపండి.. నీళ్లు పెడతామని ప్రాధేయపడినా పట్టించుకోని అధికారులు ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి అంటూ వారిని అక్కడి నుంచి పంపేసే ప్రయత్నం చేశారు తప్ప చిరుతను కాపాడేందుకు ఒక చిన్న ప్రయత్నం చేయకపోవడం విచారకరం. ఈ క్రమంలో గంటల తరబడి పైకి కిందికి, అటు ఇటు తిరుగుతూ ఉచ్చు నుండి తప్పించుకోవడానికి విశ్వప్ర యత్నాలు చేసిన చిరుత ఆఖరికి మిన్నుకుండు పడిపోయి కదలిక లేకుండా పోయింది. ఎంతసేపటికి చిరుత చలనం లేకపోవడంతో గ్రామస్తులు ధైర్యం చేసి సార్ మేము నీళ్లు పెడతా మంటూ అధికారులను బతిమాలి చిరుత దగ్గరికి చేరు కున్నారు. అప్పటికే చిరుత విగతజీవిగా పడిపోయింది. గ్రామస్తులు ఒక్కసారిగా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు చోద్యం చూడ్డానికే ఇక్కడికి వచ్చారు తప్ప చిరుతను కాపాడేందుకు ఒక చిన్న ప్రయత్నం చేయలేదని ఆగ్రహించారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే చిరుత చనిపోయిందని విమర్శలు గుప్పించారు. ఆఖరికి చిరుత మతదేహాన్ని కిందకి దింపి పోస్టుమార్టం నిమిత్తం పశువుల ఆసుపత్రికి తరలించారు. కాగా మృతి చెందిన చిరుత గర్భిణి అని పోస్టు మార్టం నివేదికలో వెల్లడైంది. చిరుత కడుపులో రెండు పిల్లలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. మరో ఇరవై రోజుల్లో కాన్పుఅయ్యేదని తెలిపారు. తల్లి చిరుత మతితో కడుపులోనే రెండు చిరుత పిల్లలు మత్యువాత పడ్డాయి.పని చేయని గన్ : చిరుతను కాపాడే ప్రయత్నంలో మత్తు మందు ఇచ్చేందుకు ఫారెస్ట్, వెటర్నరీ అధికారులు సంఘటనా స్థలానికి మత్తు మందు ఇచ్చే గన్ తెచ్చారు. అది పని చేయకపోగా చిలుము పట్టిపోయింది. కొంతసేపు విశ్వప్ర యత్నం చేసి ఇది పనిచేయదని పక్కకు పెట్టేశారు. రెస్క్యూ ఆపరేషన్ చేసేందుకు వచ్చిన అధికారులు ఇలాంటి పరికరాలతోనా వచ్చేదని విమర్శలు వెల్లువెత్తాయి. ఫారెస్ట్ అధికారులను సస్పెండ్ చేయాలి ఉచ్చులో చిక్కుకున్న చిరుతను కాపాడలేని ఫారెస్ట్ అధికారులను సస్పెండ్ చేయాలి. సినిమా డైరెక్టర్ వలే ఫోజులు కొట్టారే తప్ప కాపాడ్డానికి ఒక్క ప్రయత్నం చేయలేదు. చిరుతకు నీళ్లందించేందుకు గ్రామస్తులు, రైతులు ముం దుకు వచ్చినా అనుమతించలేదు. ఎండవేడిమికి తట్టుకోలేకన చిరుత బలైపోయింది. – మదన్ మోహన్‌రెడ్డి, గ్రామస్తుడు, పొన్నేటిపాలెం.అధికారులు తీవ్ర వైఫల్యం చిరుత ప్రాణాలు రక్షించడంలో అధికారులు పూర్తిగా వైఫల్యం చెందారు. అడవిలో సాహసం చేయలేని వారికి అటవీ శాఖలో ఉద్యోగులు ఎందు కు. చిరుతకు నీళ్లు అందించి ఉంటే ప్రాణాలతో బయటపడేది. ఈ ప్రయత్నం చేయకపోవడంతోనే ప్రాణాలు విడిచింది అధికారులపై చర్యలు తీసుకోవాలి. – మోహన్‌రెడ్డి, రైతు, పొన్నేటిపాలెం.ఉచ్చులు వేసిన వారిపై చర్యలు వన్యప్రాణుల వేట కోసం ఉచ్చులు వేసిన వారిపై చర్యలు తప్పవని సబ్ డిఎఫ్‌ఒశ్రీనివాసులు హెచ్చరించారు. వైల్డ్ లైఫ్ 1972 యాక్ట్ ప్రకారం వన్యప్రాణులను వేటాడడం చట్టరీత్యా నేరమని, మరీ ముఖ్యంగా ఉచ్చులు వేయడం తీవ్రమైన నేరంగా పరిగణించడం జరుగుతుందన్నారు. ఇలాంటి వారిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. చిరుతను రక్షించేందుకు అవసరమైన పరికరాలు, ట్రైనర్స్ మనకు అందుబాటులో లేరు. తిరుపతి జూ పార్కునుంచి వారు వచ్చేలోపు చిరుత మతి చెందడం దురదష్టకరం.
