ప్రజాశక్తి-చల్లపల్లి (కృష్ణా) : నూతన కౌలు రైతు చట్టంలో మార్పు చేయాలని ఏపీ కౌలు రైతు సంఘం కఅష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి పంచకర్ల రంగారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక గుంటూరు బాపనయ్య శ్రామిక భవనంలో ఘంటసాల చల్లపల్లి మోపిదేవి మండలాల చెందిన కౌలు రైతు సంఘం సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న పంచకర్ల రంగారావు మాట్లాడుతూభూ యజమానితో సంబంధం లేకుండా కౌలు రైతులకు గుర్తింపు కార్డు నివ్వాలని కోరారు. కౌలు రైతులకు బ్యాంకు రుణాలు, రైతు భరోసా, కల్పించాలి అన్నారు., రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని ఖరీఫ్ లో మిగిలిన రైతులన నుండి ధాన్యం కొనుగోలు చేయాలనికోరారు. మినుము మొక్కజన్న పంటలకు మద్దతు ధర ప్రకటించాలని కోరారు. రైతులు కౌలు రైతులకు రుణాల అందించాలని అన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కూలీలకు 200 రోజులు పని కల్పించాలని అన్నారు. జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి పని కల్పించాలన్నారు. ఉపాధి కూలీలకు పని ప్రాంతంలో తాగునీరు, టెంట్, మందులు అందుబాటులో ఉంచాలన్నారు. పై సమస్యలపై సదస్సులో తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం కఅష్ణా జిల్లా అధ్యక్షులు శీలం నారాయణరావు, జిల్లా కౌలు రైతు సంఘం సహాయ కార్యదర్శి మరీ సురేష్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు యద్దనపూడి మధు,, సంఘం నాయకులు వాకా రామచంద్రరావు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు మేడంకి వెంకటేశ్వరరావు, బెజవాడ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
