కాలేజీలో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు

ఒంగోలు (ప్రకాశం) : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో … రైజ్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఏర్పాటు చేయనున్న స్ట్రాంగ్‌ రూములు, కౌంటింగ్‌ రూముల ముందస్తు ఏర్పాట్లను కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ఏఎస్‌.దినేష్‌ కుమార్‌, జిల్లా ఎస్పి పి.పరమేశ్వర రెడ్డిలు మంగళవారం పరిశీలించారు. శింగరాయకొండలోని పెరల్‌ డిస్టలరీ వద్ద ఏర్పాటు చేసిన ప్రకాశం నెల్లూరు జిల్లాల బోర్డర్‌ చెక్‌ పోస్ట్‌ ను జిల్లా ఎస్పీ పి పరమేశ్వర్‌ రెడ్డి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ తోపాటు జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌.గోపాల క్రిష్ణ, అడిషనల్‌ ఎస్పీ నాగేశ్వర రావు, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీలత, ఒంగోలు, కొండపి ఆర్‌ఓ లు సుబ్బారెడ్డి, కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

➡️