పంచాయతీ కాంప్లెక్స్‌కు వేగినాటి కోటయ్య పేరు

ప్రజాశక్తి-యర్రగొండపాలెం: యర్రగొండపాలెం పట్టణంలో గత టిడిపి ప్రభుత్వ హయాంలో పంచా యతీ కార్యాలయం ఎదురుగా కాంప్లెక్స్‌ను నిర్మించారు. ఆ కాంప్లెక్స్‌పై అప్పట్లో యర్రగొండపాలెం అభివృద్ధికి పాటు పడిన మాజీ సమితి ప్రెసిడెంట్‌ దివంగత వేగినాటి కోటయ్య పేరును రాయించి ఆ భవన సముదాయానికి వేగినాటి కోటయ్య భవన సముదాయం అని నామకరణం చేశారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం వెంటనే పంచాయతీ కాంప్లెక్స్‌పై రాసిన వేగినాటి కోటయ్య పేరు ను తొలగించి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వాణిజ్య సముదాయంగా నామకరణం చేసి పేరు రాయించారు. దీనిపై అప్పట్లో టిడిపి నాయకులు వేగినాటి కోటయ్య పేరు మార్చ డంపై ధర్నాలు చేశారు. అయినా వైసీపీ నేతలు పట్టించుకోలేదు. కాగా గత ఏడాది యర్రగొండపాలెం వచ్చిన టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు యర్రగొండ పాలెం పట్టణంలోని ఎన్టీఆర్‌ కూడలిలో చైతన్య రథంపై ప్రజలను ఉద్దేశించి మాట్లా డుతూ పంచాయతీ కాంప్లెక్స్‌కు ఈ ప్రాంత అభివృద్ధికి పాటు పడిన నాయకుడి పేరు పెడితే తీసేస్తారా.. ఇది మంచి పద్ధతి కాదు.. అని అన్నారు. తాము అధికారం లోకి వచ్చిన వెంటనే వేగినాటి కోటయ్య పేరు తిరిగి పెట్టే బాధ్యత తీసుకుంటామని అన్నారు. దీంతో అప్పటి చంద్రబాబు మాటలను గుర్తు చేసుకుంటూ టిడిపి భారీ మెజార్టీతో గెలుపొందడంతో టిడిపి కార్యకర్తలు పంచాయతీ కాంప్లెక్స్‌పై ఉన్న వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పేరును తొలగించారు. వేగినాటి కోటయ్య పేరును రాయించారు. చంద్రబాబు చెప్పిన మాటలను కార్యకర్తలు నిజం చేశారు.

➡️