గాంధీ కలలు కన్న స్వరాజ్యానికి తూట్లు

Oct 2,2024 21:55

 ప్రజాశక్తి-సాలూరు :   గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం తీసుకురావాలని గతంలో వైసిపి ప్రభుత్వం సంకల్పిస్తే, దానికి తూట్లు పొడిచేలా టిడిపి కూటమి ప్రభుత్వం పని చేస్తోందని మాజీ డిప్యూటీ సిఎం రాజన్నదొర అన్నారు. బుధవారం స్థానిక తహశీల్దార్‌ కార్యాలయ ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టిడిపి కూటమి అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే గ్రామ స్వరాజ్యానికి తూట్లు పొడిచే చర్యలు చేపట్టిందని చెప్పారు. మహాత్మా గాంధీ పేరుతో ఉన్న జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తోందని విమర్వించారు. అందులో సర్పంచుల ప్రాధాన్యత తగ్గించేందుకు కుటిల రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. వాలంటీర్ల వ్యవస్థకి మంగళం పాడిందన్నారు. సచివాలయ వ్యవస్థ కూడా గందరగోళంలో పడిందని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ వంగపండు అప్పలనాయుడు, జెసిఎస్‌ కన్వీనర్‌ గిరి రఘు, మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ గొర్లి జగన్‌ మోహన్‌ రావు, మాజీ కౌన్సిలర్లు పిరిడి రామకృష్ణ, ఎం.అప్పారావు, వైసిపి సీనియర్‌ నాయకులు దండి శ్రీనివాసరావు, పాచిపెంట చినబాబు, మువ్వల ఆదియ్య పాల్గొన్నారు.

➡️