హాలహర్వి (కర్నూలు) : మండల కేంద్రమైన హాలహర్వి నుండి మజార గ్రామమైన మాచనూరు రోడ్డు దుస్థితి. ఈ ఊరికి కల్వర్టు బ్రిడ్జి పడిపోయి దాదాపుగా 9 సంవత్సరాలు అవుతున్నా అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకున్న నాధుడే లేడు అని గ్రామస్తులు అంటున్నారు. నీట్రావట్టి నుండి విరుపాపురం వరకు రోడ్డు అద్వానంగా మారింది అలాగే గూళ్యం నుండి బళ్ళురు, గూళ్యం నుండి జే హౌసల్లి, చింతకుంట నుండి బేవిన హాల్, చింతకుంట నుండి సిరుగాపురం, చింతకుంట నుండి ఎంకేపల్లి, రోడ్ల దుస్థితి అస్తవ్యస్తంగా ఉంది. ఈ రోడ్డు గుండా ప్రయాణించే వాహనదారులు ఇక్కట్లు పడుతున్నారు. ధనుంజరు మాచనూరు గ్రామస్తుడు సిపిఎం నాయకులతో మాట్లాడుతూ …. ” మా గ్రామానికి అత్యవసర వాహనాలు రావడానికి ఇబ్బందిగా ఉంది మా ఊరి నుండి మండల కేంద్రానికి వెళ్లాలంటే మూడు కిలోమీటర్లు నరకయాతన పడాల్సి వస్తోంది అలాగే కల్వర్టు బ్రిడ్జి పడిపోయి దాదాపు తొమ్మిది సంవత్సరాలు కావస్తున్న పట్టించుకునే నాధుడే లేడు మా ఊరికి రోడ్డు వేసి కల్వర్టు బ్రిడ్జి కట్టించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను ” అని విన్నవించారు.
