- టిడిపి సీనియర్ నేత వీర్రాజు చొరవతో
ప్రజాశక్తి – ఆలమూరు(కోనసీమ) : జొన్నాడ మండపేట ఆర్ అండ్ బి రోడ్డుపై ఏర్పడిన భారీ గోతులతో ఆలమూరు నుంచి కొత్తూరు వరకు మండల కేంద్రానికి చెందిన పారిశ్రామికవేత్త ఒంటిపల్లి విశ్వనాథం సౌజన్యంతో ఏఎంసీ మాజీ చైర్మన్ ఈదల నల్ల బాబు పర్యవేక్షణలో పూర్తి చేశారు. అలాగే గురువారం కొత్తూరు సెంటర్ నుంచి గుమ్మిలేరు పరిధి వరకు మరింత అధ్వాన్నంగా భారీ గుంతలు ఏర్పడడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిని గుర్తించిన గుమ్మిలేరుకు చెందిన టిడిపి సీనియర్ నాయకులు ఈదల వీర్రాజు చౌదరి ఆధ్వర్యంలో పినపళ్ళ జనసేన ఎంపీటీసీ సభ్యులు పెద్ధిరెడ్డి పట్టాభి రామన్న జెసిబి ఏర్పాటు చేశారు. దీంతో భారీగోతులను చదును చేసి, ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టారు. జరుగుతున్న పనులను వీర్రాజు చౌదరి దగ్గరుండి భారీ గోతులను చదును చేయించారు. దీంతో రోడ్డు చదునుకు చొరవ చూపిన వారిని ఈ సందర్భంగా పలువురు అభినందించారు.