ప్రజాశక్తి-రాజవొమ్మంగి (అల్లూరి జిల్లా) : బాలికను ప్రేమ పేరుతో మోసగించిన అల్లూరి జిల్లా రాజవొమ్మంగి మండల కేంద్రానికి చెందిన చిత్తారపు రాంబాబుపై పోక్సో కేసు నమోదు చేసినట్లు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎన్.సన్యాసినాయుడు తెలిపారు. ఆ కేసు వివరాలను ఆయన బుధవారం మీడియాకు తెలిపారు. రాజవొమ్మంగికి చెందిన ఇంటర్మీడియట్ చదువుతున్న ఓ బాలికకు రాంబాబు మాయమాటలు చెప్పి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. ఇదే విషయమై బాధిత బాలిక తల్లి రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ నరసింహమూర్తి ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు సాగుతోంది.
