ప్రజాశక్తి-తాడేపల్లి రూరల్ : తమ సమస్యను పరిష్కరించాలని కోరుతూ తాడేపల్లిలోని ఎసిసి కార్మికులు ఎమ్మెల్సీ కేసు లక్ష్మణరావు ద్వారా జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మికి బుధవారం విన్నవించారు. గుంటూరులోని కలెక్టర్ కార్యాలయంలో కలిసి తమకు రావాల్సిన నష్టపరిహారంపై వినతిపత్రం ఇచ్చారు. కలెక్టర్ స్పందిస్తూ తన పరిధిలోని అంశాల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. వినతిపత్రం ఇచ్చినవారిలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై.నేతాజీ, నాయకులు వి.దుర్గారావు, ఎసిసి కార్మిక పోరాట కన్వీనర్ కె.స్టీవెన్, బి.అంకయ్య, కె.ఆదినారాయణ, సూర్యప్రకాష్ ఉన్నారు.