ప్రజాశక్తి-కడప అర్బన్ కోవిడ్ సమయంలో కొత్తగా తీసుకున్న కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని ఎపి మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ జిల్లా ఉపాధ్యక్షులు కంచుపాటి తిరుపాల్ డిమాండ్ చేశారు. బుధవారం కడప నగర పాలక సంస్థ ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ కొత్త కార్మికులకు పెండింగ్‌లో ఉన్న 2 నెలల వేతనాలు, ఐడి కార్డులు, యూనిఫాం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇఎస్‌ఐపిఎఫ్ కల్పించాలని, శీతాకాలంలో ఉదయాన్నే మస్టర్ 5.40 గంటలకు పెట్టాలని అధికారులు చెప్పడం సరికాదన్నారు. అడిషనల్ కార్మికుల పైన సెక్రటరీ వేదింపులు ఆపాలని డిమాండ్ చేశారు. మరణించిన కార్మికుల కుటుంబాల్లో ఉద్యోగాలు ఇవ్వాలని, ఇంజినీరింగ్ కార్మికులకి 36 జిఒ ప్రకారం వేతనాలు పెంచాలని చెప్పారు. 9 మంది ట్యాంకర్ డ్రైవర్స్‌కి వైఆర్ జిఒ ప్రకారం జీతాలు ఇవ్వాలని, 13 మందిని డ్రైవర్లుగా గుర్తించాలని పేర్కొన్నారు. శానిటేషన్ డ్రైవర్స్ నిశ్చితాకాలంలో 5 గంటలు మస్టర్‌కి రావడానికి కార్మికులు చాలా ఇబ్బందులు గురవుతున్నారని తెలిపారు. దూర ప్రాంతం నుంచి ఆటోనగర్, తిలక్‌నగర్, రామాంజనేయపురం, రామరాజుపల్లి చుట్టుపక్కల దూర ప్రాంతం నుంచి వచ్చే కార్మికులను దష్టిలో ఉంచుకుని 5.40కి మస్టర్‌ని మార్చాలని పేర్కొన్నారు. న్యాయమైన డిమాండ్స్‌ని తక్షణమే పరిష్కారం చేయకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ నాయకులు ఇత్తడి ప్రకాష్, సుంకర రవి, కిరణ్, సాయి, నాగరాజు, శివ, కార్మికులు పాల్గొన్నారు.