ఆర్‌టిసి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

ప్రజాశక్తి-రాయచోటి టౌన్‌ సమరశీల పోరాటాలకు ప్రతీక ఎంప్లాయిస్‌ యూనియన్‌ అని అన్నమయ్య జిల్లా గౌరవ అధ్యక్షులు పిఎన్‌బి రెడ్డి అన్నారు. గురువారం ఎపిఎస్‌ ఆర్‌టిసి ఎంప్లాయిస్‌ యూనియన్‌ 73వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వేడుకలు నిర్వహించారు. మాజీ గ్యారేజీ కార్యదర్శి టి.ఎన్‌.ప్రతాప్‌రాజు చేతుల మీదుగా జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎపిఎస్‌ఆర్‌టిసి కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయుటకు ఎంప్లాయిస్‌ యూనియన్‌ ఎంతో కషి చేసిందన్నారు. నిరంతరం ఆర్‌టిసి కార్మికుల కోసం ఆలుపెరగని పోరాటం చేసేది ఎంప్లాయిస్‌ యూనియన్‌ మాత్రమే అని అన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు మెరుగైన జీతభత్యాలు ఇప్పించడంలో కూడా ఎంప్లాయిస్‌ యూనియన్‌ రాష్ట్ర నాయకులు సేవ మరువలేనిదని పేర్కొన్నారు. అనంతరం ఎంప్లాయిస్‌ యూనియన్‌ సాధించిన విజయాలను వివరించారు. కార్యక్రమంలో డిపో కార్యదర్శి జిఎం.రెడ్డి, డిపో అధ్యక్షులు ఎస్‌.ఎ.సమద్‌, డిపో ప్రచార కార్యదర్శి కె.విజరు కుమార్‌, డిపో జాయింట్‌ సెక్రటరీ పి.శివయ్య, జిల్లా ప్రచార కార్యదర్శి కె.చలమారెడ్డి, గ్యారేజ్‌ కార్యదర్శి మనోజ్‌ కుమార్‌, కమిటీ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. మదనపల్లె అర్బన్‌: ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని ఎఐటియూసి జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బాబు, సాంబశివ డిమాండ్‌ చేశారు. ఎపిపిటిడి ఎంప్లాయిస్‌ యూనియన్‌ ఆవిర్భాన దినోత్సవాన్ని మదనపల్లె ఆర్‌టిసి-1, 2వ డిపోల్లో జెండా ఆవిష్కరణ చేసి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంస్థలో పనిచేస్తున్న సిబ్బంది రకరకాల ఒత్తిళ్లకు గురవుతూ అనారోగ్యం పాలవుతున్నారని, పని ఒత్తిడి తగ్గించడంతో పాటు మహిళా కండక్టర్లకు రాత్రి డ్యూటీలు వేయకూడదన్నారు. ఇతర ఉద్యోగస్తుల కంటే ఆర్టీసీలో పనిచేస్తున్న కార్మికుల పని పరిస్థితులు, పని వేళలు వేరుగా ఉంటాయన్న విషయాన్ని యాజమాన్యం గుర్తుపెటు ్టకోవాలన్నారు. అనారోగ్య సమస్యలతో పాటు రోడ్డు ప్రమాదాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఆర్టీసీ సిబ్బందిని ఈ హెచ్‌ ఎస్‌ నుంచి మినహాయించి పూర్వం లాగానే అన్‌ లిమిటెడ్‌ రిఫరల్‌ వైద్యాన్ని పునరుద్దించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కృష్ణప్ప, ఎఐటియుసి మదనపల్లి నియోజకవర్గ సహాయ కార్యదర్శి ముభారక్‌, పట్టణ కార్యదర్శి తిరుమల, ఆర్టీసీ యూనియన్‌ అధ్యక్షులు పూల శ్రీనివాసులు సెక్రెటరీ హుస్సేన్‌ గ్యారేజ్‌ సెక్రెటరీ అంజాద్‌ హుస్సేన్‌, ఎపిజెఎసి మహిళా విభాగంలో చంద్రకళ సుగుణ, సిబ్బంది పాల్గొన్నారు.

➡️