ప్రజాశక్తి-మార్కాపురం: రాష్ట్రవ్యాప్తంగా అపరిష్కతంగా ఉన్న మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోరుతూ అక్టోబరు 2వ తేదీన రాష్ట్రంలోని అన్ని మునిసిపల్ కార్యాలయాల వద్ద సత్యాగ్రహ దీక్షలు యుటిఎఫ్ ఆధ్వర్యంలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మార్కాపురం మున్సిపల్ కమిషనర్ డివిఎస్ నారాయణకు, ఎంఇఒ బి.రాందాస్ నాయక్‌లకు విషయాన్ని తెలియజేస్తూ యుటిఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నోటీసులను శనివారం అందించారు. ఉద్యమాలు ఉధృతం కాకముందే సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఒ.వి.వీరారెడ్డి, జిల్లా మునిసిపల్ టీచర్స్ కన్వీనర్ ఎన్.ఎస్.ఎ.ఎల్.రవికుమార్, కోశాధికారి ఎం.శ్రీనివాస నాయక్, జిల్లా కౌన్సిలర్ పి.విజయలక్ష్మి, పి.అంకమ్మ, వై.లక్ష్మి, సిహెచ్.శ్రీనివాసులు, ఎన్.ఏలియా, వి.అల్లూరయ్య, ఎం.శ్రీనివాసరెడ్డి, పి.నాగ ఫణీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.