ప్రజాశక్తి-పామూరు: గ్రామాల్లో సమస్యలు ఉంటే స్థానిక సర్పంచులు పరిష్కరించాలని పామూరు సిఐ భీమానాయక్ అన్నారు. సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్లో సర్పంచులకు గ్రామాల్లో ఉన్న సమస్యలపై అవగాహన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ గ్రామాల్లో బెల్ట్ షాపు నిర్వహించినా, మద్యం తాగి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నా అలాంటి వాటిపై సర్పంచి దృష్టిపెట్టి అరికట్టా లని అన్నారు. ప్రజాప్రతినిధిగా ఎన్నుకున్న సర్పంచ్ ఆ పంచాయతీ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. దేవాలయాలపై పేకాట ఆడటం, అరికట్టాలన్నారు. గ్రామాలలో గంజాయి అమ్మకం తాగడం జరిగితే సర్పంచ్ అలాంటి వారిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. గ్రామాల్లో వ్యసనానికి అలవాటూ పడితే ఆ గ్రామం అభివృద్ధి చెందదని అన్నారు. చిన్న వయసులో వివాహాలు చేస్తుంటే విషయం తెలుసుకొని మా దృష్టికి తీసుకురావాలని అన్నారు. లేనిపక్షంలో మీరే పరిశీలించుకోవాలని సూచించారు. గ్రామాలలో డాక్టర్లతో కర్రలోడు అటు ఇటు వైపుల ఎక్కువ లోడు వేసుకొని వస్తే వాటి వల్ల ప్రమాదాలు ఏర్పడుతున్నాయని అలాంటి ట్రాక్టర్లను సర్పంచ్ అరికట్టాలని అన్నారు. ఆటోల్లో పరిమితికి మించి జనాల్ని ఎక్కించుకుంటే లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. లైసెన్సు లేకుండా డ్రైవింగ్ చేసిన చట్టరీత్యా నేరమని అన్నారు. గ్రామాల అభివృద్ధికి సర్పంచులు కృషి చేయాలని, ఎలాంటి సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని సర్పంచ్‌లను కోరారు. ఈ సమావేశంలో మండలంలోని పంచాయతీ సర్పంచులు హాజరయ్యారు.
