ప్రజాశక్తి-తెనాలి రూరల్ (గుంటూరు) : సాగునీటి సంఘాల ప్రాజెక్టు కమిటి ఎన్నికలు నేటితో ముగిశాయి. బాపట్ల జిల్లా అమృతలూరు మండలంలోని కూచిపూడి జలవనరుల శాఖ కార్యాలయంలో శనివారం జిల్లా ఎన్నికల అధికారులు ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికలు సజావుగా ముగిశాయి. బాపట్ల డిసి-37 నుంచి పంతాని మురళీధర్ రావు ప్రాజెక్టు కమిటి ఛైర్మెన్ గా, చేబ్రోలు డిసి-49 నుంచి నువ్వుల సునీల్ చౌదరి లు ఏకగ్రీవంగా ఎన్నికయారు. డిస్ట్రిబ్యూటరీ కమిటీ సభ్యులు ఆమోదంతో ఎన్నిక ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఛైర్మెన్, వైస్ చైర్మన్ అభ్యర్థులకు రేపల్లె ఆర్డీవో ఎన్ రామలక్ష్మి, ప్రాజెక్టు కమిటి ఎన్నికల అధికారి సౌధాగర్ అభూతలీం, గుంటూరు సర్కిల్ ఐసి ఎన్నికల అధికారి పులిపాటి వెంకటరత్నం ఎన్నికైన అభ్యర్థులకు ప్రొసీడింగ్స్ ఆర్డర్ అందజేశారు. కృష్ణ, వెస్టర్న్ డెల్టా ఛానల్ పరిధిలో నిర్వహించిన ప్రాజెక్టు కమిటి ఎన్నికల్లో 22 మంది డిస్ట్రిబ్యూటరి కమిటి అధ్యక్షులు అధ్యక్షులు పాల్గొన్నారు. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, ప్రత్తిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్నారు. నూతన సాగునీటి సంఘాల ఛైర్మెన్, వైస్ చైర్మన్ లను అభినందించారు.
