హంసలదీవి వద్ద వెనక్కి వెళ్లిన సముద్రం

కోడూరు (కృష్ణా) : కోడూరు మండలం హంసలదీవి సమీపంలోని పాలకాయతిప్ప బీచ్‌ వద్ద వింత పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఏర్పడిన వాయుగుండం ప్రభావం ఈ బీచ్‌ వద్ద కనిపించకపోగా, సముద్రం సుమారు 50 మీటర్ల మేర వెనక్కి వెళ్లింది. దీంతో తీరం ఒడ్డు వెంట సుమారు రెండు అడుగుల మేర ఇసుక దిబ్బలు ఏర్పడ్డాయి. దీంతో మత్స్యకారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సముద్రం వెనక్కి వెళ్లడానికి కారణం తెలియరాలేదు.

 

➡️