ఎర్రదండు కవాతు..!

Jan 24,2025 22:59
నగారా మోగిస్తున్న విఎస్‌ఆర్‌

నగారా మోగిస్తున్న విఎస్‌ఆర్‌
ఎర్రదండు కవాతు..!
ప్రజాశక్తి-నెల్లూరుభారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) ఆంధ్రప్రదేశ్‌ 27వ రాష్ట్ర మహాసభల సందర్భంగా ఎర్రదండు కవాతు నిర్వహించింది. ఎర్రచొక్కా, ఎర్రచీర, చేతిలో పార్టీ పతాకాలతో క్రమశిక్షణాయుతంగా నిర్వహించిన కవాతు నగర వాసులను ప్రత్యేకంగా ఆకర్షించింది. శుక్రవారం స్థానిక విఆర్‌సి మైదానంలో సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో రెడ్‌షర్ట్‌ వలంటీర్ల కవాతు నిర్వహించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు నగారాను మోగించి కవాతును ప్రారంభించారు. ముందుగా విఆర్‌సి క్రీడా మైదానంలో రెడ్‌ షర్ట్‌ వాలంటీర్ల వందనాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు స్వీకరించారు. కవాతు విఆర్‌సి క్రీడా మైదానం నుంచి అంబేద్కర్‌ విగ్రహం,గాంధీబొమ్మ,తిరిగి విఆర్‌సి క్రీడా మైదానం వరకు నిర్వహించారు. ఈ సందర్బముగా వి. శ్రీనివాసరావు మ్లాడుతుతూ .నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడే సిపిఎం ఆంధ్రప్రదేశ్‌ 27వ రాష్ట్ర మహాసభలు ఫిబ్రవరి 1,2,3 తేదీల్లో సింహపురి గడ్డపై నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. సింహపురి గడ్డ అనేక ప్రజా ఉద్యమాలకు పురుడు పోసి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు స్ఫూర్తిగా నిలిచినదన్నారు. దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య జన్మించిన సింహపురిపై ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నామన్నారు. యువత మహిళలు అధిక సంఖ్యలో మహాసభలలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రజలకు ఉపయోగపడే ఒక ప్రత్యామ్నాయ రాజకీయ విధానాన్ని,ప్రజా పోరాటాలను మహాసభలలో చర్చించి రూపొందించబోతున్నామన్నారు. జిల్లాలో వ్యవసాయ,కార్మిక, రైతాంగ కార్మిక పోరాటాలు అనేక సామాజిక ఉద్యమాలు సిపిఎం నిర్వహించడం జరిగిందని అన్నారు. ఫిబ్రవరి 3వ తేదీ ఆత్మకూరు బస్టాండ్‌ సెంటర్‌ నుండి మహాప్రదర్శన వి ఆర్‌ సి గ్రౌండ్‌ లో భారీ బహిరంగ సభ జరుగుతుందని ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డి. రమాదేవి, జిల్లా కార్యదర్శి మూలం రమేష్‌ మాట్లాడారు. సిపిఎం నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు , జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం మోహన్‌ రావు, అజరు కుమార్‌, గోపాల్‌, నగర కార్యదర్శివర్గ సభ్యులు జి.నాగేశ్వరరావు,షేక్‌. మస్తాన్‌బీ, పి.సూర్యనారాయణ, కాయంబు శ్రీనివాసులు, నగర కమిటీ సభ్యులు బీపీ నరసింహ,షేక్‌ రషీద్‌, మూలం ప్రసాద్‌, కత్తి పద్మ, ఎం.చిరంజీవి, కె.చెంగయ్య, కె.ఏమేలు, అల్లంపాటి శ్రీనివాసులు రెడ్డి, ఆవుల పెంచలయ్య, షేక్‌.జాఫర్‌,పి. వేణు, శాఖా కార్యదర్శులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️