విధిగా ఓటు హక్కు వినియోగించుకోవాలి

 తెనాలి: సమాజంలో ప్రతి ఒక్కరూ విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ ఆఫీసర్‌, మునిసిపల్‌ కమిషనర్‌ బండి శేషన్న సూచించారు. స్థానిక కొత్తపేటలోని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కార్యా లయంలో ఉద్యోగులకు ‘ఓటు హక్కును వినియోగించు కు ందాం – ధర్మ బద్ధమైన ప్రజాస్వామ్యాన్ని నిర్మించు కుందాం’ అంటూ ఓటుహక్కు విని యోగంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సం దర్భంగా ఎస్బీఐ చీఫ్‌ మేనేజర్‌ ఎవిఆర్‌ పవన్‌ కుమార్‌ మాట్లాడారు. కార్య క్రమంలో స్వీప్‌ నోడల్‌ ఆఫీ సర్‌, మునిసిపల్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ కె.అనూష, ఎస్బీఐ కొత్తపేట డిప్యూటీ మేనేజర్‌ బి. లక్ష్మా నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️