రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టిన స్కూటర్‌ – వ్యక్తికి తీవ్రగాయాలు

తిరుపతి సిటీ : రోడ్డు డివైడర్‌ను స్కూటర్‌ ఢీకొట్టడంతో వ్యక్తికి తీవ్రగాయాలైన ఘటన శనివారం తిరుపతిలో జరిగింది. స్కూటర్‌ పై వెళుతున్న వ్యక్తి అతివేగంతో వెళుతూ వడమాలపేట అంజేరమ్మ కనుమలో రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టాడు. సుమారుగా 300 మీటర్ల దూరంలో స్కూటరు పై ఉన్న వ్యక్తి వేరువేరు రోడ్లలో పడ్డాడు. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తికి ముక్కు, నోటి, తల భాగాలలో దెబ్బలు తగిలి రక్తస్రావంతో తీవ్రంగా గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. తమిళనాడు తిరువళ్లూరు జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. తమిళనాడు తిరువళ్లూరు నుంచి చంద్రగిరి లోని వారి చెల్లి ఇంటికి వెళ్లే క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాలినడకన వెళ్లే తిరుమల యాత్రికులు ఈ ప్రమాద ఘటనను గమనించి, 108 అంబులెన్స్‌ కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్‌ సిబ్బంది అక్కడకి చేరుకొని తీవ్రగాయాలపాలైన వ్యక్తికి ప్రధమ చికిత్స చేసి, మెరుగైన వైద్యం కోసం వెంటనే తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

➡️