ప్రజాశక్తి-రాజోలు : సమాజానికి దళిత చైతన్య వేదిక చేస్తున్న సేవలు అభినందనీయమని రాజోలు వైస్ ఎంపీపీ పొలుమూరి శ్యాంబాబు అన్నారు. రాజోలు మండలం కడలి గ్రామంలో మంగళవారం దళిత చైతన్య వేదిక నాయకులు పే బ్యాక్ టు ద సొసైటీ కార్యక్రమంను కడలి ప్రభుత్వ హైస్కూల్ ప్రాధానోపాధ్యాయులు ఎస్ఎస్ఎస్ శర్మ అధ్యక్షతన నిర్వహించారు. తొలుత దళిత చైతన్య వేదిక నాయకులు స్కూల్ సిబ్బంది అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం 53 మంది పదోవ తరగతి విద్యార్థులకు ప్యాడ్లు, పెన్నలు, స్కేళ్ళు, పెన్సిల్స్, షార్ప్నర్స్, ఏరైజర్స్ ను కడలి గ్రామ సర్పంచ్ చొప్పల గుణనాద్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. దళిత చైతన్య వేదిక కుల మతాలకు అతీతంగా చేస్తున్న సేవలను వైస్ ఎంపీపీ పొలుమూరి శ్యాంబాబు ప్రశంసించారు. దళిత చైతన్య వేదిక ప్రతిష్టాత్మకంగా చేస్తున్న పే బ్యాక్ టు ద సొసైటీ కార్యక్రమాలకు సహకరిస్తున్న మిత్రులందరికీ ఈ సందర్భంగా దళిత చైతన్య వేదిక వ్యవస్థాపకుడు బత్తుల మురళీకృష్ణ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఎంఈవో జొన్నలగడ్డ గోపాలకృష్ణ, దళిత చైతన్య వేదిక నాయకులు చిలకపాటి శ్రీధర్, మందపాటి మధు, మట్టా సురేష్ కుమార్, విప్పర్తి మహేష్, పొన్నమాటి భాస్కర్, తోట సుభాష్ రోయ్, విద్యా కమిటీ చైర్మన్ వడ్లమూడి ప్రకాష్ రావు, ఉపాధ్యాయులు ఐ సుధ, డి శ్రీనివాస్, పి. ధర్మశేఖర్, కె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
