పాలకొండల దర్శనం గొప్ప అనుభూతి

ప్రజాశక్తి – కడప కడప కొంగు సింగారాలను ఒలగబోస్తున్న పాలకొండలు, అక్కడి జలపాత సవ్వడులను, పక్షుల కిలకిల రావాలను, ఆస్వాదించడం కొత్త అనుభూతిని ఇచ్చిందని, ఇది గొప్ప అవకాశంగా భావి స్తున్నామని కలెక్టర్‌ శివశంకర్‌ లోతేటి అన్నారు. ఆదివారం ఆటవిడుపులో భాగంగా కుటుంబ సభ్యులతో కలిసి ఆయన కడప నగర శివారులోని పాలకొండలను సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాటా ్లడుతూ చుట్టూ పచ్చదనం, పాలకొండల ప్రకతి రమణీయ దశ్యాలు, తమకెంతో ఆహ్లాదాన్ని, ఆనందాన్ని అందించిందన్నారు. పాలకొండల జలపాతంలో తడవడం, తమ కుటుంబానికి ఆదివారం చక్కటి ఆటవిడుపులా గడిచిందన్నారు. పర్యాటకం వైపు ఆసక్తిని పెంచే సహజమైన అడవులు కడప జిల్లా సొంతం అన్నారు. కడప నగరానికి మూడు వైపులా నల్లమల అడవుల్లో భాగమైన కొండలు విస్తరించి ఉన్నాయన్నారు. పర్యటక ప్రియులను ఆకట్టుకునే ప్రకతి వనరులు జిల్లాలో కోకొల్లలుగా ఉన్నాయన్నారు. చూసే మనసుండాలే గానీ, చారిత్రాత్మక కట్టడాలు, ప్రకతి రమణీయ దశ్యాలు.. ఇలా కడప జిల్లాలో ప్రతీ రాయి, ప్రతి వాగు, వంక, చెట్టు చేమా.. అన్నీకూడా పర్యాటక సొగసులను అరబోసేవే అని వ్యాఖ్యనించారు.పర్యాటక ప్రియులు జిల్లాలో మనకు అందుబాటులో ఉన్న దర్శనీయ ప్రాంతాలను ఖచ్చితంగా చూడాలని పిలుపునిచ్చారు.

➡️