ప్రజాశక్తి-బేస్తవారిపేట : ప్రధానమంత్రి జన ఔషధీ కేంద్రాన్ని బేస్తవారిపేట పోలీస్ స్టేషన్ రోడ్డులో మాజీ సైనికుడు గోపు రమణారెడ్డి ఏర్పాటు చేశారు. ఈ జనరిక్ మెడికల్ స్టోర్‌ను ఎస్‌ఐ రవీంద్రారెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ రవీంద్రారెడ్డి మాట్లాడుతూ పీఎం జన ఔషధీ కేంద్రాలలో దాదాపు 50 నుంచి 90 శాతం అతి తక్కువ ధరలకే బ్రాండెడ్ మందులతో సమానమైన నాణ్యత కలిగిన మందులు లభిస్తాయని తెలిపారు. అన్ని రకాల జబ్బులకు ఈ కేంద్రాలలో మందులు లభిస్తాయన్నారు. మాజీ సైనికుడు గోపు రమణారెడ్డి మాట్లాడుతూ ఈ కేంద్రాలలో బీపీ, షుగర్, కిడ్నీ, క్యాన్సర్, థైరాయిడ్ ఇతర అనేక రకాలైన జబ్బులకు మందులు లభిస్తాయని తెలిపారు. ఆర్థిక భారంతో మందులు కొనలేని పరిస్థితులలో ఉన్న వాళ్లకు ఈ కేంద్రం ఒక మంచి అవకాశమని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశమంతటా వేలాది కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతి రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో ఈ పీఎం జన్ ఔషధి కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకు నాణ్యమైన మందులు తక్కువ ధరలకు అందించాలనే లక్ష్యంతో తీసుకొచ్చిన పీఎం జనరిక్ షాపులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. తన స్వగ్రామం బేస్తవారిపేట మండలం మండలం చిన్న ఓబినేనిపల్లి గ్రామం కావడంతో తాను ఈ ప్రాంత ప్రజల సౌకర్యార్థం తక్కువ ధరలకు మెరుగైన జన ఔషధీ మందుల షాపును ఏర్పాటు చేశానని తెలిపారు. ఈ ప్రాంత ప్రజలు పీఎం జన ఔషధ జనరిక్ షాపులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని గోపు రమణారెడ్డి కోరారు.
