ప్రజాశక్తి – కడప ప్రతినిధికేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన తీవ్ర అన్యాయానికి రాష్ట్రంలోని టిడిపి, వైసిపిల కుమ్మక్కు రాజకీయాలే కారణమని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎం.ఎ.గఫూర్ విమర్శించారు. ఆదివారం కడప నగరంలోని రామకృష్ణనగర్‌లోని సిపిఎం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్‌లో వైఎస్‌ఆర్ జిల్లాలో స్టీల్‌ప్లాంట్ మొదలు కుని, వెనుకబడిన ప్రాంతాలకు నిధులు, రాజధానికి అమరావతి నిర్మాణానికి సైతం అప్పురూపంలో మాత్రమే విధిలింపులు చేసిందన్నారు. వైసిపి హయాంలో బటన్ నొక్కుడు రాజకీయాలతో విదిలింపులు చేసి, బటన్ నొక్కుడు ముసుగులో దోపిడీ రాజకీయాలు చేశారని విమర్శించారు. కరువు, నిరుద్యోగం, వరదలకు తావే లేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 2020 విజన్ డాక్యుమెంట్ స్థానంలో 2047 విజన్ డాక్యుమెంట్ పేరుతో కలలో తేలియాడే భ్రమలు కల్పిస్తు న్నారన్నారు. మోసపూరిత రాజకీయాల కారణ ంగానే 2019లో తోకకత్తిరించారని గ్రహించాలని తెలిపారు. సాగునీరు మొదలుకుని రహదారులు, ప్రభుత్వ మెడికల్ కళాశాలల వరకు ప్రయివేటు జపం చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన టిడిపి, వైసిపి కుమ్మక్కు రాజకీయాల్లో మునిగిన నేపథ్యంలో బిజెపి తమ కార్పొరేట్, మతోన్మాద రాజకీయాలను వేగవంతం చేయడానికి గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అదానీ సోలార్ విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని అధికార టిడిపి లోపాయికారీగా అంగీకరిస్తున్నట్లు ఉందన్నారు. గత వైసిపి హయాంలో కుదిరిన రూ.150 కోట్ల అక్రమ అదానీ ఒప్పందాలను రద్దు చేయకపోవడంలోని ఆంతర్యమేమిటో వెల్లడించాలని డిమాండ్ చేశారు. మణిపూర్‌లోని హూతి, కుకీ జాతి ప్రజల మధ్య ఆయుధాలతో యుద్ధం చేయాల్సిన దుస్థితికి కేంద్ర, రాష్ట్రాల్లోని బజెపి సర్కార్లే కారణమని ఆరోపించారు. కుంభమేళా పేరుతో నిర్వహిస్తున్న హిందు ఆదిపత్య రాజకీయాలతో తొక్కిసలాటలతో పదుల సంఖ్యలో మనుషులు చనిపోవడానికి బిజెపి సర్కార్ల అసమర్థ నిర్వాకమే కారణమని విమర్శించారు. కార్యక్ర మంలో సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎ.రామ్మోహన్, బి.మ నోహర్, జి.శివకుమార్, వి.అన్వేష్ పాల్గొన్నారు.
