శ్రీమంతుడి ఆక్రమణలపై స్పందించిన సబ్‌ కలెక్టర్‌

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ (రాయచోటి-kadapa) : శ్రీమంతుడు ముసుగులో ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై సబ్‌ కలెక్టర్‌ స్పందించారు. మండల పరిధిలోని పోలి అపరాజుపేట పంచాయితీలో ఓ ఎన్నారై గ్రామానికి సేవ చేస్తానని శ్రీమంతుడు ముసుగులో 831 బి సర్వే నెంబర్లు ఆక్రమించిన 80 సెంట్లు ప్రభుత్వ స్థల ఆక్రమణపై ఆ గ్రామ దళితులు సబ్‌ కలెక్టర్‌ కు ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్పందించిన సబ్‌ కలెక్టర్‌ వైఖోమ్‌ నదియాదేవి సోమవారం రెవిన్యూ అధికారులతో జెసిబి తో ఆక్రమణ స్థలం చుట్టూ కట్టిన గోడను తొలగించారు. ఎన్నారై కు సహకరించి విద్యుత్‌ స్తంభాలు ఏర్పాటు చేసిన విద్యుత్‌ సిబ్బందిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారో లేదోనని స్థానికులు చర్చించుకుంటున్నారు.

➡️