ప్రజాశక్తి-యర్రావారిపాలెం (తిరుపతి) : నోట్ బుక్ తీసుకురాలేదని వాతలు తేలేలా విద్యార్థిని ఉపాధ్యాయుడు చితకబాదిన ఘటన శుక్రవారం యర్రావారిపాలెం మండలంలోని చింతగుంట గ్రామంలో జరిగింది. గ్రామంలోని జడ్పీ హైస్కూల్లో నాలుగో తరగతి చదువుతున్న బి. సాత్విక్ (8) ఈరోజు స్కూల్ కి నోట్‌బక్ తీసుకురాలేదని అదే మండలానికి చెందిన టీచర్ భాస్కర్ నాయుడు విద్యార్థిని క్రూరంగా శరీరమంతా వాతలుపడేలా చితకబాదారని విద్యార్థి తల్లిదండ్రులు హరిబాబు, రేవతి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఎంఈఓ, డీఈఓ ఉపాధ్యాయునిపై తగిన చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఉద్యమిస్తామని సోషల్ జస్టిస్ లీగల్ రైట్స్ ఫోరం ప్రెసిడెంట్ రెడ్డి చర్ల నరేష్ బాబు మీడియాకు తెలిపారు.
నోట్ బుక్ తేలేదని విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు
