జిల్లా న్యాయ సేవ అధికార కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి.
ప్రసూన న్యాయ కళాశాలలో రాజ్యాంగ దినోత్సవం
ప్రజాశక్తి – కర్నూలు అగ్రికల్చర్ : భారత రాజ్యాంగం దినోత్సవం, వరకట్న వ్యతిరేక దినోత్సవ సందర్భంగా శ్రీ ప్రసూన న్యాయ కళాశాలలో మంగళవారం సదస్సును కలశాల ప్రిన్సిపాల్ శివాజీ రావు అధ్యక్షత నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా జిల్లా న్యాయ సేవా అధికార కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి, పర్మినెంట్ లోక్ అదాలత్ చైర్మన్ వెంకట హరినాథ్,సీఎల్ డిసి మనోహర్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా లీలా వెంకట శేషాద్రి మాట్లాడుతూ భారత రాజ్యాంగ దినోత్సవం ప్రసూన న్యాయ కళాశాలలో నిర్వహించడం శుభపరిణానం అన్నారు. రాజ్యాంగ దినోత్సవాన్ని
26 నవంబర్ 1949 న, భారత రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించిందని 1979 దాకా ఎలాంటి గుర్తింపు రోజుగా లేదన్నారు. ఆ తరువాత నేషనల్ లా డే గా నిర్వహించేవారని తెలిపారు. తిరిగి భారత ప్రభుత్వం 19 నవంబర్ 2015న గెజిట్ నోటిఫికేషన్ ద్వారా నవంబర్ 26ని రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించిందన్నారు. అందువల్ల రాజ్యాంగం యొక్క సిద్ధాంతాలను వ్యాప్తి చేయడానికి మరియు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆలోచనలు వ్యాప్తి చేయడానికి ఈ రోజును ఎంచుకున్నారని తెలిపారు. ప్రతి ఒక్క న్యాయ విద్యార్థి లీగల్ సెల్ సర్వస్ లో పాల్గొనాలని అట్టడుగు స్థాయికి న్యాయం యొక్క విలువ తెలియజేయాలన్నారు. ప్రతి ఒక్కరికి న్యాయ సలహాలు అందరికి న్యాయం అందించేలా ప్రతి ఒక్కరు లీగల్ సెల్ సర్వీస్ లో తమ వంతు కృషిని అందించాలని అందుకు ప్రతి లా విద్యార్థి దరఖాస్తు చేసుకోవాలని కోరారు. అనంతరం పర్మినెంట్ లోక్ అదాలత్ చైర్మన్ శ్రీ వెంకట హరినాథ్ మాట్లాడుతూ అట్టడుగు అణగారిన వర్గం నుండి భారత రాజ్యాంగాన్ని రచించిన స్థాయికి వచ్చిన గొప్పవ్యక్తి డాక్టర్ బి.అంబేద్కర్ అన్నారు. దాదాపు 32డిగ్రీలను సాధించి ప్రతి ఒక్కరికి సమనన్యాయం కావాలని ప్రపంచ రాజ్యాంగలను చదివి సేకరించిన అతి గొప్ప రాజ్యాంగం భారత దేశంలో మాత్రమే ఉందన్నారు. అందుకే ప్రపంచంలో కెల్లా గొప్ప రాజ్యాంగాన్ని మనం పొందమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రసూన లా కళాశాల డీన్ శివకుమార్, అధ్యాపకులు రావుఫ్,మైఫుజ్ బాషా, హేమలత రెడ్డి, మెహిది హుస్సేన్ ఖాన్, మాలిక్ బాషా, అడ్మినిస్ట్రేషన్ అధికారి జె.రాజమోహన్, సిబ్బంది మధు,నాగరాజు, న్యాయ విద్యార్థులు,పాల్గొన్నారు