రాజముద్రలో ఉర్దూ భాషకు చోటు కల్పించాలి

ప్రజాశక్తి-రాయచోటి టౌన్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజముద్రలో రెండో అధికార భాష ఉర్దూను చోటు కల్పించాలని సహారా వెల్ఫేర్‌ సొసైటీ ప్రధాన కార్యదర్శి షేక్‌ అఫ్తాబ్‌ పేర్కొన్నారు. శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలం గాణ రాష్ట్ర రాజమద్రలో రెండు అధికార బాషగా ఉన్న ఉర్దూకు చోటు కల్పించిన విషయం అందరికీ తెలిసిందేనని అన్నారు. రాష్ట్ర రాజముద్రలో కూడా ఉర్దూ భాషను చోటు కల్పించాలని పేర్కొన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో, ఉర్దూ సాహి త్యం ఎంతోమందిని దేశం కోసం ప్రాణ త్యాగానికి ప్రేరేపించి ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించిందని వారు గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అధికార కార్యక లాపాలు, ఉత్తర, ప్రత్యుత్తరాలను తెలుగుతో పాటు ఉర్దూ లోనూ సాగించేలాగ సమాన హోదా కల్పించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దష్టికి తీసుకె ళ్లాలని కోరుతూ గురువారం రాయచోటికి వచ్చిన ఎపి రాష్ట్ర మైనార్టీల వ్యవహారం ముఖ్య సలహాదారులు ఎం.ఎ.షరీఫ్‌ను స్టేట్‌ గెస్ట్‌ హౌస్‌లో కలిసి వినతి పత్రాన్ని సమర్పించినట్లు తెలిపారు. కార్యక్రమంలో సొసైటీ సభ్యులు జిలాన్‌ బాషా, కార్యదర్శి ఇలియాస్‌ బేగ్‌, అఫ్జల్‌, సగీర్‌, జంజం జమీల్‌, యూసుఫ్‌ పాల్గొన్నారు.

➡️