ప్రజాశక్తి-కనిగిరి: కనిగిరి పట్టణంలోని సురా పాపి రెడ్డి నగర్‌లో రెండు రోజుల క్రితం గాలివాన బీభత్సానికి రెండు రేకుల ఇల్లు కూలిపోగా మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ మంగళవారం సిబ్బం దితో కలిసి కూలిన ఇళ్లను పరిశీలిం చారు. ఉన్నతాధికారుల దష్టికి తీసుకువెళ్లి పరిహారం అందే విధంగా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. అనంతరం కనిగిరి ఆర్డీవో కేశవర్ధన్ రెడ్డిని మున్సిపల్ చైర్మన్‌ను కలిశారు. ఇటీవల గాలి వాన బీభత్సానికి శివారు కాలనీలలోని పలు నివాసాలు కూలిపోయాయని, శంఖవరంలో కూడా ఓ మహిళ గోడకూలి మతి చెందిందని ఆర్డిఓకు వినతిపత్రం సమర్పించి బాధితులకు నష్టపరిహారం అందే విధంగా ఉన్నతాధికారుల దష్టికి సమస్యను తీసుకువెళ్లి న్యాయం చేయాలని కోరారు. స్పందించిన ఆర్డిఓ బాధితులకు పరిహారం అందే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
