కూటమి విజయం ఆనందదాయకం: గరికపాటి

ప్రజాశక్తి-దర్శి: రాష్ట్రంలో జనసేన, తెలుగుదేశం, బిజెపి కూటమి విజయం సాధించటం ఆనందదాయకమని దర్శి నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జి గరికపాటి వెంకట్‌ అన్నారు. దర్శిలోని జనసేన పార్టీ కార్యాలయంలో జనసైనికులు, వీర మహిళలతో కలిసి కేక్‌ కట్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారాల్లోకి రావడం శుభ పరిణామమన్నారు. జనసేన రాష్ట్ర అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ పోటీ చేసిన 21 స్థానాలు గెలవడం ఇది ఒక చరిత్రని అన్నారు. పవన్‌ కళ్యాణ్‌ మీద నమ్మకంతో ప్రజలందరూ ఆయనకు ఓట్లేశారన్నారు. ఈ సందర్భంగా దర్శి నియోజకవర్గంలో జన సైనికులకు, వీర మహిళలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తాను గతంలో హామీ ఇచ్చినట్టుగా దర్శిలో మెగా జాబ్‌ మేళా నిర్వహిస్తానన్నారు. అదేవిధంగా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో వాటర్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.

➡️