ప్రజాశక్తి – నాదెండ్ల : మండల కేంద్రమైన నాదెండ్లలోని నందికొండ విఘ్నేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా జరుగుతున్న ఒంగోలు జాతి వృషభ రాజుముల బండ లాగుడు పోటీల్లో భాగంగా మంగళవారం 4 పళ్ల విభాగంలో చిలకలూరిపేటలోని పురుషోత్తమపట్నానికి చెందిన షేక్ అబ్దుల్ సత్తార్, షేక్ అమీర్‌బాబు ఎడ్ల జత 3962.2 అడుగుల దూరం లాంగి విజేతగా నిలిచింది. బాపట్ల జిల్లా జె.పంగులూరుకు చెందిన గొట్టిపాటి రవికుమార్ యూత్ చిలుకూరి నాగేశ్వరరావు ఎడ్లజత 3923 అడుగులతో రెండోస్థానం, కృష్ణా జిల్లా పెనుములూరు మండలం యనమలకుదురుకు చెందిన అనంతనేని కావ్య, మధు ఎడ్ల జత 3576.2 దూరంతో మూడో స్థానం, బాపట్ల జిల్లా యద్దనపూడి మండలం అనంతవరానికి చెందిన పెడవలి బ్రదర్స్, పివిఆర్ బుల్స్ ఎడ్ల జత 3250 అడుగులతో నాలుగో స్థానం సాధించాయి. పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఆంగలూరుకు చెందిన రేగళ్ల హరిబాబు, బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం పాతమాగులూరుకు చెందిన చీరబోయిన కోటేశ్వరరావు ఎడ్ల జతలు 2832.5 అడుగుల దూరంతో ఐదో స్థానం, గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం కండ్రికకు చెందిన కెఎన్‌ఆర్ మెమోరియల్ కేళం పద్మ నాయుడు ఎడ్లజాత 2551.4 అడుగుల దూరంలో ఆరో స్థానం, బాపట్ల జిల్లా చీరాల మండలం సావరపాలేనికి చెందిన కొమ్మనబోయిన వెంకటేశ్వర్లు ఎడ్ల జాత 2024.1 అడుగుల దూరంతో ఏడో స్థానాన్ని దక్కించుకున్నాయి.
