మున్సిపల్‌ వర్కర్లపౖౖె పని ఒత్తిడి పెరిగింది

 పిడుగురాళ్ల: మున్సిపల్‌ వర్కర్స్‌ యూని యన్‌ సమావేశం పిడుగురాళ్ల పట్టణంలోని వర్కర్స్‌ కాలనీలో కె.సీతారామయ్య అధ్యక్షతన ఆది వారం నిర్వహించారు.ఈ సంద ర్భంగా యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు చంద్రకళ మాట్లా డుతూ మున్సిపల్‌ వర్కర్లపౖౖె పని ఒత్తిడి పెరిగిందని అన్నారు. సబ్బులు, నూనెలు, యూనిఫామ్‌లు కార్మికులకు వెంటనే ఇవ్వాలని, చని పోయిన కార్మికులకు రావాల్సిన పరిహారం ఏళ్ల తర బడి పెండింగ్‌లో ఉందని, వెంటనే విడుదల చేయా లని, వర్కర్స్‌ కు పనిముట్లు ప్రభుత్వమే సరఫరా చేయాలని, పెండింగ్‌ లో ఉన్న హెల్త్‌ అలవెన్స్‌ వెంటనే ఇవ్వాలని తదితర సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆమె డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో యూనియన్‌ జిల్లా గౌరవ అధ్యక్షులు షేక్‌ సిలార్‌ మసీద్‌,సిఐటియు మండల కార్యదర్శి తెలకపల్లి శ్రీనివాసరావు, కార్మికులు రామారావు, కాండ్రగుంట ఎలమంద,దేవల్ల చిన్న వెంక టేశ్వర్లు మహంకాళి యాలంకయ్య, కంపసాని వీరమ్మ, కృష్ణవేణి, జయేంద్ర,చల్లా పద్మ,దేవరకొండ లక్ష్మి, కోడి రెక్క మేరమ్మ తదితరులు పాల్గొన్నారు.

➡️